కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేసిన రాయపాటి?
posted on Aug 27, 2012 @ 10:21AM
ఎంపి రాయపాటి సాంబశివరావుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మను పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్‌పార్టీని వదిలేయమని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. తిరిగి ఛైర్మనుగా ఎంపి కనుమూరి బాపిరాజు నియమితులైనందుకు అసంతృప్తితో ఉన్న రాయపాటి అనుచరులు భారీసంఖ్యలో తమ నేత ఇంటికి చేరారు. ఉదయం నుంచి ఒకటే హడావుడిగా వచ్చిన అనుచరులు, కార్యకర్తలు రాయపాటిని కాంగ్రెస్‌పార్టీ వదిలేయమని కోరుతున్నారు. అసలు తమ నేత రాయపాటి అంతరంగం తెలిసినా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని రాయపాటి అనుచరులు అభిప్రాయానికి వచ్చారు. అసలు రాయపాటిని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవటమే మానేశారని అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పద్ధతి లేకపోవటం వల్లనే తమ రాయపాటికి అన్యాయం జరిగిందని అనుచరులు అభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా ఈ విషయంలో తాము సిఎంను వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికల నేపథ్యంలో పీసిసి నేతలు కూడా రాయపాటి సాంబశివరావుకు అన్యాయం జరిగిందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. బాపిరాజు సహృదయత, భక్తిభావమే ఆయనకు పదవి తిరిగి ఇప్పించిందని అభిప్రాయపడుతున్నారు.