డబుల్ డెక్కర్ రైళ్లొచ్చేస్తున్నాయ్
posted on Aug 27, 2012 @ 10:23AM
దక్షిణమధ్య రైల్వే శాఖ పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఏసి డబుల్‌డక్కర్ రైళ్లను నిర్వహించేందుకు కేంద్రం అనుమతి కోరుతోంది. ప్రత్యేకించి ఈ డబుల్‌డక్కర్ వల్ల హైదరాబాద్ `విశాఖపట్టణం మధ్య ప్రయాణీకుల ఒత్తిడి కొంత వరకూ తగ్గవచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. అలానే హైదరాబాద్`విజయవాడ కూడా ఇదే తరహాసర్వీసు నడపాలని రైల్వేశాఖ అభిప్రాయపడుతోంది. ఇటీవల హౌరా`ధన్‌బాద్ మధ్య ఏడాది నుంచి నడుస్తున్న డబుల్ డక్కర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఢల్లీి`జైపూర్‌ల మధ్య ఇంకో సర్వీసును నడిపేందుకు రంగం సిద్ధమైంది. దక్షిణమధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టాలనుకున్న ఈ డబుల్‌డక్కర్‌లపై కేంద్రం అథó్యయనం చేస్తోంది. ఈ అథ్యయనం ఒక కొలిక్కి రాగానే ఈ సర్వీసులకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఒక్కో కోచ్‌లో 300మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందువల్ల భారీసంఖ్యలో ప్రయాణీకులు ఒకేసారి హైదరాబాద్`విశాఖల మధ్య షటిల్ చేయటానికి వెసులుబాటు లభిస్తుంది. అలానే బస్సులపై ఒత్తిడి తగ్గి రైల్వేకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశమూ పెరుగుతుందని రైల్వేశాఖ అంగీకరిస్తోంది. అందువల్ల తమ ప్రతిపాదనలు త్వరగా మంజూరు చేయాలని కోరుకుంటోంది. కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తోంది.