రేషన్ గురించి ప్రశ్నిస్తే ఏకంగా తలలు పగలకొట్టాడు... ఏపీలో దారుణం
posted on Nov 7, 2020 @ 1:39PM
రేషన్ షాపు టైమింగ్స్ దగ్గర నుండి.. సరుకుల కొలతలు, తూకం పైన ప్రశ్నించిన ఇద్దరు వ్యక్తుల పై ఒక రేషన్ షాప్ డీలర్ భర్త దాడి చేయడమేకాక ఏకంగావారి తలలు పగలగొట్టడం తో కలకలం రేగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి గ్రామంలో ఒక మహిళ ప్రభుత్వ రేషన్ దుకాణం డీలర్ గా ఉంది. అయితే ఆ రేషన్ షాపును మైంటైన్ చేసేది మాత్రం ఆమె భర్తగారే. ఆ రేషన్ షాపును టైం కు ఓపెన్ చేయకపోవడంతో పాటు సరుకుల కొలతలు, తూకంలో తేడాలు ఉండడంతో విసిగిపోయిన ఇద్దరు పౌరులు ఇదేమని ప్రశించడంతో బూతులు తిడుతూ... చేతికి దొరికినదానితో వాళ్లిద్దర్నీ చితకబాదిన అతడు తూకపు రాళ్లతో కొట్టి వారి తలలు పగలకొట్టాడు. దీంతో కొంత మంది స్థానికులు గాయపడిన వారిద్దరికీ సపోర్ట్ గా రాగా వారిని కూడా దుర్భాషలాడాడు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ రేషన్ డీలర్ భర్తపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.