సింధూ సిల్వర్ పతకంపై వర్మ కామెంట్స్... మనిషిగా కూడా చూడరు
posted on Aug 22, 2016 @ 11:33AM
ఆఖరికి రాంగోపాల్ వర్మ ఒలింపిక్స్ ను కూడా వదల్లేదు. రియో ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన పతకాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. రియో ఒలింపిక్స్ లో పీవీ సింధూ రజత పతకం సాధించిన వేళ అందరూ తనపై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. రాంగోపాల్ వర్మ మాత్రం.. "ఒక్క సిల్వర్ పతకానికే మనల్ని మనం ఇన్ క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటే.. ఇక 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని పిలవాలి? జస్ట్ అడుగుతున్నా" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇక వర్మ చేసిన ట్వీట్ కు అభిమానులు సైలెంట్ గా ఉంటారా.. వారు కూడా చాలా ఘాటుగానే వర్మకు ఆన్సర్స ఇచ్చారు. అవెంటో ఓ లుక్కేద్దాం..
* "ఇండియాలో ప్రజలు మిమ్మల్ని ఓ దర్శకుడిగా భావిస్తున్నారు. అదే మీరు అమెరికా వెళితే, ఓ మనిషిగా కూడా చూడరు. అంతే తేడా" అని అభిమాని అన్నాడు.
* అడుగడుగునా నీ లాంటి వ్యంగ్యాస్త్రాలు వేసే వారుండబట్టే ఇండియా తక్కువ పతకాలతో ఆగిపోయిందని ఒకరు, ఇక్కడి వసతులతో అమెరికా గెలిచిన పతకాలకన్నా, ఈ రెండు పతకాలే గొప్పవని మరొకరు అన్నారు.
* మన పొరుగు దేశాలకు పతకాలే లేని వేళ, ఉత్త చేతులతో తిరిగిరాని ఇండియాను ఎందుకు అంటున్నారని ఇంకొకరు మండిపడ్డారు.