నర్సింగ్ యాదవ్ కావాలనే డ్రగ్స్ తీసుకున్నాడు...
posted on Aug 22, 2016 @ 12:13PM
ఇప్పటికే భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్ట్ లో నిషేదిత పదార్దాలు తీసుకున్నట్టు వెల్లడైంది. నర్సింగ్ యాదవ్ నిషేదిత పదార్ధాలు తీసుకోలేదని భారత డ్రగ్స్ నిరోధక సంస్థ వెల్లడించినా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రపంచ డ్రగ్స్ నిరోధక సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఇక దీనిపై విచారించిన కోర్టు నర్సింగ్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నాడని తేలుస్తూ.. అతనిపై నాలుగేళ్లపాటు నిషేదం విధించింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరో కొత్త విషయం బయటపడింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ యాదవ్ ఇప్పటివరకూ తనను కావాలనే ఈ కుట్రలో ఇరికించారని అంటున్నా.. అది నిజం కాదని అంటున్నారు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) అధికారులు. నర్సింగ్ కావాలనే నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని.. ఒకటి కంటే ఎక్కువ సార్లు వాటిని ట్యాబ్లెట్ల రూపంతో తీసుకున్నాడని.. సాక్ష్యాలు సమర్పించడంలో నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడని సీఏఎస్ నివేదికలో పేర్కొంది.