వామ్మో రాంగోపాల్ వర్మ దేవుడికి మొక్కాడా..!
posted on Sep 4, 2015 @ 5:00PM
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది పెద్ద హాట్ టాపిక్ కే అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూ విమర్శల వర్మగా పేరు పొందాడు. ఆయన మనుషులనే కాదు దేవుడిని కూడా తన విమర్శలకు బలి చేస్తుంటాడు. గత ఏడాది వినాయక చవితి సమీపిస్తుండగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న కూడా గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలోకి కూడా దేవుడిని లాగేశాడు వర్మ. మరి అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు దేవుడికి దండం పెడుతూ బయటకు వచ్చిన ఫోటో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఎందుకంటే రాంగోపాల్ వర్మ నాస్తికుడని అందరికి తెలిసిందే.. అతడు దేవుడికి మొక్కింది లేదు.. కనీసం తన సినిమా పూజా కార్యక్రమాలకి కూడా అంత ఆసక్తి చూపించరు. మరి అలాంటి వర్మ దేవుడికి దండం పెట్టడం విశేషమే కదా.. మరి ఇంతకీ ఆ ఫోటో ఎవరి తీశారో తెలుసా మంచు మనోజ్.. ఎక్కడ దొరికాడో ఎలా దొరికాడో తెలియదు కానీ.. వర్మ వినాయకుడికి దండం పెడుతూ మనోజ్ కెమెరాకు చిక్కేశాడు. మనోజ్ మాత్రం ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోలేదు వెంటనే ఫోటో తీసి ‘‘చిట్టచివరికి వర్మ దేవుడికి తలవంచాడు’’ అని రాసి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక అంతే ట్విట్టర్లో ఈ ఫొటో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ఫోటోపై పూరి జగన్నాథ్ కూడా ‘‘ఇంత సడెన్ నువ్విక్కడికి ఎందుకొచ్చినట్లు.. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని వర్మను దేవుడు తిడుతుండొచ్చు’’ అంటూ తనదైన శైలిలో ఓ కామెంట్ విసిరారు. మొత్తానికి వర్మ దేవుడికి మొక్కడమేమో కాని దేవుడు దిగి వచ్చినంత హడావుడి చేస్తున్నారు జనాలు.