తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు సీరియస్ వార్నింగ్
posted on Sep 4, 2015 @ 4:05PM
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఏదో విషయంలో గిల్లికజ్జాలు వస్తూనే ఉన్నాయి. ఈరెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలు తీరేవి కూడా కావు.. దీనిలో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల సమస్యపై ఎప్పటినుండో ఇరు రాష్ట్రాలు వాదనలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం 1200 మంది ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేసింది. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితిలో చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు అటు కేంద్రాన్ని.. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం పై హైకోర్టు కూడా చాలా సార్లు విచారణ కూడా జరిపింది. అయితే ఈసారి మాత్రం హైకోర్టు సీరియస్ గా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈకేసు విచారణ చేసిన హైకోర్టు వాదనలు వింటున్న సమయంలో ఇరు రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంగా విసిగిపోయిన హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఒకటి చేసింది. ఈ అంశంలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధికారులు ఒకచోట కూర్చొని సమస్యను సామారస్యంగా పరిష్కరించుకుంటారా? లేదంటే.. మమ్మల్నే ఆదేశాలు ఇవ్వామంటారా? అని అడిగేసింది. దీనికి మీకు వారం గడువు ఇస్తున్నాం.. ఈ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారా లేదా మమ్మల్నే సీన్లోకి ఎంటరై సమస్యను పరిష్కరించమంటారా అని మండిపడింది. మరి హైకోర్టు ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి.