Politics for out-of-work stars

 

 

 

Looks like politics is becoming a haven for out-of-work and retired movie stars. With senior actor Krishnam Raju already joining BJP, we have one more entry-actor Rajasekhar and his wife Jeevitha, who has formally joined the BJP on Monday in the presence of BJP State leader Kishen Reddy.

 

Now this couple, who have made a full circle and touched the doors of all political parties except CPI, started with the TDP and then joined the Congress during the YSR regime. In between there was a fallout with actor Chiranjeevi and they were on backlash against him and his brother Pawan Kalyan which they even stated in an interview with a prominent news channel about his rude behavior and this has seen Pawan Kalyan imitating how Rajasekhar speaks with an accent in his block buster movie Gabbar Singh and ultimately the PRP merging with the Congress is past history. Post YSR’s death they were seen hobnobbing with Jagan’s YSRC Party.

 

who made use of the couple’s star status and if rumors are to be believed he was not happy with the extra attention that Rajasekhar got during an event and sidelined them. They were lost for some time and tried to get back to TDP but with no credible status and the lack of support from the inside TDP cadre they moved back. With both of them attending the prestigious Statue of Unity project one-day workshop by the BJP recently it was understood they were getting into the BJP mode.



Rajasekhar’s film career is known to be on the downfall with no hit to his credit and also known for his eccentricities he has put forward Jeevitha in the front end with her joining the party formally. Known to be an eloquent speaker and  whether she will be given a party ticket is yet to be seen except for adding to the glam-quotient to the rallies and public meetings conducted by the party.



Actress Roja is another meanderer, who first joined the TDP and was also the Woman Wing President of Telugu Mahila Party. She lost during the 2009 state elections, and in August 2009, she quit  the TDP and joined Congress Party. She also quit the Congress party showed her open support to Y. S. Jaganmohan Reddy's political party YSR Congress Party during the political turmoil after he was sidelined by the Congress High Command. Excepting for adding to the glamour we have to wait and see if any of these actors are capable of contesting in the forthcoming elections.

మోడీ మౌనం దేనికి సంకేతం?

బంగ్లాదేశ్ లో  హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.  ఇప్ప‌టికీ మ‌ణిపూర్ మ‌ర‌క అలాగే  ఉంది. ఆ రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌టించిన‌పుడు కూడా ఎలాంటి స్పంద‌నా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్ల‌మెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ  పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్య‌వ‌హారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే..    ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి   కీల‌కాంశాలు సభలో అస‌లు చ‌ర్చ‌కే  రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం.  ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ  భ‌క్తి  హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే..  బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?   ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా  ఇందిరాగాంధీ ఉండి ఉంటే  ప‌రిస్థితి ఇలా  ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.  బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని  తాత్కాలిక  ప్ర‌భుత్వం న‌డుస్తోంది. ఆయ‌న  ప్ర‌జాస్వామికంగా ఎన్నికైన పాల‌కుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్ప‌టికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్ర‌భుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూన‌స్ సర్కార్  ప్ర‌జా  ప్ర‌భుత్వం  కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.   అదలా ఉంటే..  యూన‌స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన భార‌త  వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల‌ను ఆక్ర‌మించే య‌త్నం చేస్తున్నారు.  చైనాతో క‌ల‌సి బార‌త  వ్య‌తిరేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును స‌జీవ ద‌హ‌నం చేసిన  ఘ‌ట‌న‌లో కేంద్రం క‌నీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్క‌డేగానీ ఆయ‌న  పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అత‌డిని సజీవదహనం చేశారు.  అలాంటి బంగ్లా ప్ర‌భుత్వంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.  డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?

  వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు, అరెస్ట్ చేస్తానంటున్నాడు.​ కూటమి ప్రభుత్వ భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు వస్తే, తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ  మోడల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానించినందుకు నిరసనగా 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం చేపట్టారు.  కోటి సంతకాలు చేసిన వారి చిరునామా, ఫోన్ నంబర్లు కూడా పొందుపరిచామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని కూడా తెలిపారు. ఇది మాత్రం కొత్త విధానం. "మేము అబద్ధం చెప్పడం లేదు" అని నిరూపించుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.​ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఒక అనుమానం వ్యక్తం చేయడం, అందుకు నిరసన వ్యక్తం చేయడం విపక్షంగా జగన్ బాధ్యత. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టగానే, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని భావించిన వారికి, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వినగానే నిరాశే మిగిలింది.​  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభాలో, ఇంత తక్కువ వ్యవధిలో ఒక కోటి నాలుగులక్షల సంతకాలు సేకరించడం అంటే అంత సులభం ఏమీ కాదు. ప్రతి పల్లెలోనూ, పట్టణాలలోనూ జనరల్ బాడీ మీటింగులు పెట్టినా సేకరించడం కష్టం. పల్లెల్లో సంతకాలు పెట్టడం మరీ కష్టం. అధికారపార్టీకి వ్యతిరేకంగా సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా సంకోచిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను 'సంక్షేమ రాష్ట్రం' అనే కంటే 'సంక్షేమ పథకాల రాష్ట్రం' అంటే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలే కాక, వారి మేనిఫెస్టో ప్రకారం చేసిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. తటస్థంగా ఉండేవాళ్ళు అంత బాహాటంగా రారు. పట్టణాలలో మీటింగులకు రావడమే కష్టం. ​ఇన్ని పరిమితుల మధ్య కోటి సంతకాలు సేకరించడం కష్టంతో కూడుకున్న పని. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉన్నట్లు వెంటనే రుజువు అవుతూ ఉంటాయి.  అందుకే సంతకాల విషయంలో రుజువులు కూడా జత చేయవలసి వచ్చింది. ఇంత కష్టపడి కార్యకర్తలు చేసిన పనిని, ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలతో వృధా చేశారు. పీపీపీ మోడల్‌ను తాను ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు తీసుకుంటే, వారిని తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు మొదలు తెలుగుదేశంపార్టీ కార్యకర్తల నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ చేసే పనిలో పడి పాలనను మరచిపోవడమే జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణం.  ప్రధానమంత్రి, అమిత్ షా ఆశీస్సులు ఉంటే చాలనుకుని పాలనకు దూరంగా ఉన్నారు. బటన్ నొక్కితే చాలనుకుని ప్రజలకు దూరం అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరెస్టులు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డాయో అనే సమీక్ష జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కానీ, ప్రజలకు అరాచకం నచ్చకనే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టారు.​ ఆయన అధికారంలోకి వస్తేఏంచేయాలనుకుంటున్నారు అంటే 'జైళ్లు నింపుతాడు' అనే నినాదం ఇస్తున్నట్లుగా ఉంది. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార సంస్థలను వెళ్లగొడతాను అనే మాటతోనే ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనకు చాలా పెద్ద న్యాయవాదుల బృందం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారిని జైల్లో పెట్టడానికి చట్టరీత్యా అవకాశం ఉండదు అనే కనీసపు సలహా కూడా ఇస్తున్నట్లుగా లేరు. ఆయనకు రాజకీయ సలహాదారులు కూడా అనేకమంది ఉన్నారు.  ఇలా బెదిరించినందువలన ప్రజలు ఓట్లు వేయరు అనే సలహా మాత్రం చెప్పడం లేదు.​ తానొక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం మరచిపోయి, యోగా దినోత్సవం నాడు ప్రధాని ఆంధ్రప్రదేశ్ వచ్చి యోగా చేసిన విషయం పక్కన పెట్టి, మీడియా ముందు అభినయం చేస్తూ చేసిన హేళన.. ఆయన ప్రజాక్షేత్రంలో ఇక ప్రజలను మెప్పించలేరు అనే విషయాన్ని ఆయనే చెప్పుకున్నట్లు అయింది. అటువంటి అభినయం చూసిన వారు కొంతమంది ఆయన్ను కమెడియన్లతో పోలుస్తున్నారు. తాను అధికారంలో ఉండగానే గౌరవం కోల్పోయారు. బెదిరిస్తే బెదరరు అని అర్థమయ్యాక కూడా 'జైల్లో పెడతాము' అంటారు.  ఉద్యోగులను రిటైర్ అయినా వదిలిపెట్టం అని అంటారు. జగన్మోహనరెడ్డి ఎలాగూ అంటున్నాడు కాబట్టి మేము తక్కువ కాదు అన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇరిగేషన్ డిపార్టుమెంటు ఉద్యోగులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కుమ్మక్కు అయి అవినీతి చేస్తున్నారంటూ, వాళ్ల ప్రభుత్వం రాగానే జైల్లో వేసి వాళ్ల ఆస్తులన్నీ జప్తు చేయిస్తారట. 'సముద్రం లోపల ఉన్నా వదిలిపెట్టను' అంటాడు జగన్. ​దేశమంతా అమలు చేస్తున్న పీపీపీ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. పథకంలో ఏవైనా అప్రజాస్వామికమైనవి ఉంటే ముందుగా ఆపథకాన్ని ఛాలెంజ్ చేయాలి.  ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఒక పథకాన్ని, దానికి కొన్ని మార్గదర్శకాలనే కాకుండా కొన్ని నిధులను కూడా సమకూర్చిన కేంద్రం మీద కనీసపు నిరసన తెలపకుండా.. కేంద్రం సూచించిన విధంగా పీపీపీ మోడ్‌లో కళాశాలలను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు నాయుడునో, భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ వ్యక్తులనో అరెస్ట్ చేయాలనడం జగన్ అవివేకానికి చిహ్నం. ​దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలలో ప్రభుత్వమే సీట్లు అమ్మే సంస్కృతిని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓల పైన అప్పటి ప్రతిపక్షం టీడీపీ  న్యాయపరమైన చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం.  ఆ విషయమై ఇప్పటికీ రాష్ట్రంలో పౌరులకు కనీస అవగాహన కలిగించకపోవడం టీడీపీ వైఫల్యానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం అనుకుంటే, ముందుగా చేయవలసింది మెడికల్ సీట్లను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన తన పాలసీకి ప్రజలకు క్షమాపణ చెప్పి, పీపీపీ మోడ్‌లో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలి. అటువంటి విధానాన్ని రూపొందించిన కేంద్రానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. ​జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిలబడాలనుకుంటే వాస్తవాలు మాత్రమే ప్రజలకు వివరిస్తూ, ఒక పద్ధతిలో నిరసన తెలుపుతూ న్యాయపోరాటం చేయాలి.  కానీ ఆయన అధికారం గురించి, చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల కోసమే అయితే సాదాసీదాగా లోకేష్ మాదిరిగా ప్రజలకు చేరువ కావాలి. ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడాలి. పొద్దుటే మీడియా ముందు యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  అక్కడ జగన్ విశ్వసనీయత కోల్పోతున్నారు.​ఇక రుషికొండ రాజభవనం గురించి జగన్ మాట్లాడకపోవడమే మంచిది. అధికారంలో ఉన్నప్పటి కంటే, అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని ఎక్కువ కోల్పోయి, కూటమి ప్రభుత్వానికి మరో పదేళ్లు తానే బాటలు వేస్తున్నట్లుగా ఉన్నది. అందుకే జగన్ చెప్పే కోటి సంతకాలను కూడా ప్రజలు విశ్వసించలేక పోతున్నారు.   

అమరావతికి చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందే ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ విషయంలో ఇప్పుడు ఎవరిలోనూ ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ స్థాయి నగరంలో అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విజనరీ చంద్రబాబు మార్గదర్శకత్వంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆల్ ఇన్ వన్ సిటీగా అమరావతి రూపుదాల్చుతోంది. ఇంత వరకూ అంతా బానే ఉంది. కానీ చాలా మందిలో ఓ చిన్న అనుమానం, చిన్న శంక, చిన్న సందేహం. ఒక వేళ తరువాత ఎప్పుడైనా జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి? 2014 నుంచి 2019 వరకూ శరవేగంగా సాగిన అమరావతి నిర్మాణం.. 2019లో జగన్ అధికారంలోకి రాగానే పడకేసింది. అంత వరకూ నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతి, జగన్ మూడు రాజధానులంటూ ప్రారంభించిన మూడు ముక్కలాటతో నిర్మాణుష్యమైపోయింది. పురోగతిలో ఉన్న భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. అప్పటి వరకూ కళకళలాడిన అమరావతి వెలవెలబోయింది. మరో సారి అటువంటి పరిస్థతి రాకూడదంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్నది జనం డిమాండ్ గా మారిపోయింది. అందుకు రాష్ట్రప్రభుత్వమూ సై అంది. అందుకే ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సిన పరిస్థితి వచ్చింది.    2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత అమరావతిని నిర్వీర్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ గత పదకొండేళ్లుగా  రాజధాని లేని రాష్ట్రంగా  మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రాజధాని కోసం లాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతులు ఈ విషయంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.  ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఆమోదముద్రపడుతుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే  అమరావతికి చట్టబద్ధత కల్పించాలని  కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. అయినా ఈ సమావేశాల్లో అటువంటి అవకాశం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. స్వయంగా ప్రధాని మోదీ చేతులమీదగా రెండుసార్లు అమరావతి శంకుస్థాపన జరిగింది. .33వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు అభివృద్ధిచేసిన ప్లాట్స్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని 10 ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ 20 వేల ఎకరాలు రాజధాని విష్తరణకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పూలింగ్ ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో చంద్రబాబు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?

చాలా మంది అనుకుంటున్న‌ట్టు.. కేసీఆర్   ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి ఆరోగ్యం కారణం కాదట... ఆయన అరోగ్యం శారీర‌క‌మైన‌ది కాదు,  ఆర్ధిక‌ప‌ర‌మైన‌ది, బయటకు తెలియని రాజకీయపరమైనది అనంటున్నారు.   తెలంగాణలో ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న‌ ఒక శ‌తృవును ఢీ కొట్టాలంటే.. మ‌రో ఇద్ద‌రు మితృలుగా కలవాలి అన్న భావనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  రేవంత్ దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని  మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ ముందుకెళ్తున్నారు. దీంతో ఇటు మోడీకి, అటు కేసీఆర్ కి ఒక ర‌క‌మైన మితృత్వం అవ‌స‌ర‌మైంది. ఎలాగైనా స‌రే ఇక్క‌డ పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ ఏకకాలంలో ఇటు కేసీఆర్, అటు రేవంత్ ఇద్దరికీ సమప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ గేమ్ అడుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్ కి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదేమంత ఫలితం ఇచ్చినట్లు కనబడదు.  నెక్స్ట్ స్టెప్ లో.. కేసీఆర్ అండ్ కో    లోక్ స‌భ‌లో లోపాయికారిగా స‌హ‌క‌రిస్తామ‌ని  మోడీకి మాటిచ్చారంటున్నారు. అన్నట్లుగానే  కేసీఆర్ తాను జీరో  అయ్యి మరీ బీజేపీకి 8 ఎంపీ  సీట్ల‌తో ఒక ఊపు ఉత్సాహం కలిగించేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో సహకరించారంటారు పరిశీలకులు. అయినా స‌రే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం  క‌నిక‌రించ‌కుండా కేసీఆర్ లాంటి మ‌ద‌గ‌జాన్ని సంపూర్ణంగా  గుప్పెట్లో పెట్టుకోవాల‌న్న యోచనతో   క‌వితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందు కూడా సై అన్న కేసీఆర్.. ఆ తరువాత బీజేపీతో అసలు డీల్ స్టార్ట్ చేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.  సరే సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందం టున్నారు విశ్లేషకులు.   గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు. ఇంతకీ మోడీ పాలసీ ఎంటంటారా?.. భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీల అగ్రనాయకులను తొలుత కేసులతో భయపెట్టి, ఆ తరువాత   కమలం శరణ్యం అనేలా దారికి తెచ్చుకోవడం. కేసీఆర్ విషయంలోనూ మోడీ అదే పాలసీని అవలంబించి ఉంటారని అంటున్నారు.   ఈ నేపథ్యంలోనే ఇటీవల  రేవంత్ చేసిన కామెంట్ ను కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఫార్ములా వన్ రేస్ కేసులో  కేటీఆర్ విచార‌ణ‌కు,  కాళేశ్వ‌రం వ్య‌వ‌హారంలో కేసీఆర్, హ‌రీష్ ల అరెస్టుకు ఈడీ, సీబీఐకి అనుమ‌తులివ్వ‌డంలో కేంద్రం ఆమోదయోగ్యం కాని జాప్యం చేస్తున్నదని రేవంత్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. సరే ఆ తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి.   కాళేశ్వరం వ్యవహారంలో ఇంకా ఎటువంటి కదలికా రాలేదన్నది తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన సుదీర్ఘ అజ్ణాతాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించడం చూస్తుంటూ.. కేంద్రంలో ఆయన ఏదో ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఆదివారం (డిసెంబర్ 21) మీడియా సమావేశంలో విమర్శలు గుప్పిస్తూనే మోడీ గారు అని సంబోధించడాన్ని వారు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. గతంలో మోడీయా, బోడీయా అన్న కేసీఆర్ ఇప్పుడు మర్యాదపూర్వకంగా మోడీగారూ అంటూ విమర్శించడమే ఏదో ఒప్పందం జరిగే ఉంటుందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. 

న‌క్స‌ల్ ఫ్రీ కంట్రీ ఎలాగో....వైసీపీ రాక్ష‌సుల్ ఫ్రీ స్టేట్ సాధ్య‌మేనా?

  ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు. 2026 మార్చి 31 నాటికి న‌క్స‌ల్ ఫ్రీ కంట్రీగా భార‌త్ ని ఎలా చేస్తున్నారో.. ఏపీ  గ‌వ‌ర్న‌మెంట్ త‌లుచుకుంటూ జ‌గ‌న్ వెంట ఉన్న ఫ్యాక్ష‌నిస్టుల‌ను, గూండాల‌ను, మ‌ర్డ‌రిస్టుల‌ను అలాగే లేకుండా  చేయ‌డం ఏమంత క‌ష్టం కాద‌న్న కామెంట్ చేశారాయ‌న‌. దీంతో ఒక్కొక్క‌రి  ఫీజులెగిరిపోయాయ్. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ అండ్ కో ఉలిక్కి ప‌డింది. ఈ కామెంట్ ప‌వ‌న్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే.. అధికారులు సైతం జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ఫ్యాక్ష‌న్ ముఠాల‌ను చూసి భ‌య‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌. వారికంటూ ధైర్యం అందించే దిశ‌గా ప‌వ‌న్ ఈ కామెంట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనంత‌టిని బ‌ట్టీ చూస్తే.. ప్ర‌భుత్వం త‌లుచుకుంటే జ‌గ‌న్ని, ఆయ‌న పార్టీని నామ రూపాల్లేకుండా చేయ‌డం పెద్ద ప‌నేం కాద‌ని  తెలుస్తోంది. నిజానికి అది సాధ్య‌మేనా? అంటే అందుకు ద‌గ్గ‌ర్లో ఉన్న ఉదాహ‌ర‌ణ న‌క్స‌లైట్ల‌ను భార‌త  ప్ర‌భుత్వం  రూపుమాపుతుండ‌టం కంటి ముందు క‌నిపిస్తూనే ఉంది. నిన్న మొన్న తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లొంగిపోవ‌ల్సిన  మావోయిస్టుల‌  సంఖ్య కేవ‌లం 54 మంది మాత్ర‌మేన‌ట‌. యాభై నాలుగు మంది అంటే చాలా చాలా  త‌క్కువ సంఖ్య‌. ఇప్ప‌టికే కొన్ని వంద‌లాది మంది మావోయిస్టులు ఇటు ఛ‌త్తీస్ గ‌ఢ్, అటు మ‌హారాష్ట్ర‌తో పాటు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల ముందు లొంగిపోతున్న దృశ్యాలు లేదా ఎన్ కౌంట‌ర్ అవుతున్న దృశ్యాలు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి.  ఈ యాంగిల్లో చూస్తే జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ర‌ప్ప ర‌ప్ప బ్యాచ్ ని అంత మొందించ‌డం పెద్ద ప‌నేం కాదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న 5 ఏళ్ల పాల‌నా కాలంలో చేసిన అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించిన  ప్ర‌తిదీ  త‌వ్వి  పోస్తున్నారు సీఐడీ అధికారులు. ఇంకా ఎన్నో డిపార్ట్ మెంట్లు జ‌గ‌న్ చుట్టూ అల్లుకుని ఉన్న అవినీతి ప్ర‌పంచం మొత్తాన్ని డీకోడ్ చేస్తున్నారు. వ‌రుస అరెస్టులు చేస్తున్నారు.  అలాంటిది  జ‌గ‌న్ చుట్టూ ఉన్న వారితో పాటు జ‌గ‌న్ ని సైతం జైలు పాలు చేయ‌డం గానీ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని అరెస్టు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. దానికి తోడు ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలను బ‌ట్టీ చూస్తే.. ఇలాంటి వారు ఫ‌లానా కేసుల్లో ఫ్రేమ్ అయితే ఆ త‌ర్వాత ఉన్న ఆ అర‌కొర, బొటాబొటి ప‌ద‌వుల‌ను కూడా కోల్పోయి జైల్లో చిప్ప కూడు తినాల్సి వ‌స్తుంది. మ‌రో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లా జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం మారాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి జ‌గ‌న్ అండ్ గో గంగ‌మ్మ జాత‌ర రివ‌ర్స్ లో ప‌డేలా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో చెప్పేదేముందీ జ‌గ‌న్ రాక్ష‌సుల్ ఫ్రీగా ఏపీ స్టేట్ అవ‌త‌రించినా అవ‌త‌రిస్తుంది.

కవితను నియంత్రిస్తేనే కేసీఆర్ ఎంట్రీ క్లిక్!?

తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం వినా తమ పార్టీ పుంజుకోవడానికి మరో మార్గం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అది కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియాశీలంగా మారి.. గతంలోలా తన మాటల మాయాజాలం ప్రయోగిస్తేనే పార్టీ  ఉనికి, భవిష్యత్ ఉంటాయనీ, లేకుంటే నానానిటీ తీసికట్టు అన్నట్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడం ఖాయమన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. అంతే కాదు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావడానికి ఇదే మంచి తరుణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి  తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  నీటి కేటాయింపులు, హక్కులను  ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  అయినా కూడా పరిశీలకులలో కేసీఆర్ గతంలోలా తన మాటలతో మాయ చేయగలరా? ఆయన ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందా? అన్న సంశయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమంటూ జరిగితే.. ఆయన తొలుత తన విమర్శల గళమెత్తాల్సింది తన తనయ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితపైనే. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత కల్వకుంట్ల కవిత.. ప్రణాళికా బద్ధంగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లను లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరంభించిన విమర్శల దాడి క్రమక్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై ఆమె చేస్తున్న విమర్శలకు జనం నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఒకరిద్దరు నేతలు కవితపై ప్రతి విమర్శలు చేస్తున్నప్పటికీ కల్వకుంట్ల కుటుంబం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.   ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనుకబడటంతో కేసీఆర్ రంగంలోకి దిగక తప్పని అనివార్య పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. అయితే కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె విమర్శలకు దీటుగా సమాధానం చెప్పకుండా నీటి సమస్యలు, సెంటిమెంట్ అంటూ మాట్లాడితే జనం వినే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా ఆమె కవిత విమర్శల ధాటిని ఆపగలిగేలా విమర్శనాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. అది కేసీఆర్ చేస్తారా? సొంత కుమార్తెపైనే  మాటల దాడికి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే. 

బ్యాలెట్ బీజేపీకి కలిసిరాదా?

తెలంగాణ‌లో  ఎనిమిది ఎంపీ సీట్లున్న బీజేపీకి క‌నీసం 800 పంచాయితీలు కూడా ఎందుకు గెల‌వ‌లేక పోయింది?  ఇదీ ప్ర‌స్తుతం పొలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చ.   బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ  ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు.   మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దేశం కోసం కాకుండా,   మోడీ కోసం పని చేస్తోందా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు.    తెలంగాణలో మూడు విడ‌త‌లుగా జరిగిన పంచాయితీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్- 7, 093 పంచాయితీల‌ను కైవ‌సం  చేసుకోగా, బీఆర్ఎస్- 3488, బీజేపీ- 699, సీపీఐ- 79, సీపీఎం- 75, ఇత‌రులు- 1264 పంచాయితీలను గెలిచాయి.  ఈ లెక్క‌న చూస్తే బీజేపీ 10 స్ట్రైక్ రేట్ కనీసం పది శాతం కూడా లేదని తేటతెల్లమౌతోంది.  మ‌రి ఇదే  బీజేపీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  ఎనిమిది స్థానాలలో ఎలా గెలవగలిగింది అని ప్రశ్నిస్తున్నారు.  బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే ఇట్స్ నాటే జోక్. కార‌ణం ఇక్క‌డున్న‌వే  17 సీట్లు. వీటిలో 8 గెల‌వ‌డం అంటే స‌గానికి స‌గం.. గెల‌వ‌డంతో స‌మానం. అలాంటిది ప‌ది శాతం పంచాయితీలు కూడా ఎందుకు రాలేద‌ని అడిగే వారికి తెలియాల్సింది ఏంటంటే.. బీజేపీని ఓట‌ర్లు ఎంపిక చేయ‌డంలో అర్ధం.. ప్రెజంట్ సిట్యువేష‌న్ ప్ర‌కారం.. ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్క‌డి నుంచి ఎంపీల‌ను పంపిస్తే.. వారు రాష్ట్రానికి ఏదైనా సాదించి తీస్కొస్తార‌ని. ఇక్క‌డ వాస్త‌వ  ప‌రిస్థితి ఏంటి అన్న‌ది  అటుంచితే.. ఓట‌ర్ల అభిమ‌తం అయితే అదీ.  ఇక కాంగ్రెస్ కూడా బీజేపీకి మ‌ల్లే  జాతీయ పార్టీ. మ‌రి  ఆ  పార్టీకి  ఏడు వేల పైచిలుకు పంచాయితీలు రావ‌డానికి గ‌ల కార‌ణాలేంటి? అని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ  అధికారంలో ఉన్నా.. ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావ‌డం త‌ర‌త‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తున్న‌దే. ఇందులో ఎలాంటి విచిత్రం ఏమీ లేదు. గ‌తంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌పుడు కూడా ఇక్క‌డా పార్టీ స‌రిగ్గా ఇలాంటి ఫ‌లితాల‌నే చ‌వి చూసింది. బీఆర్ఎస్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడే వ‌ర‌కూ కూడా ఒక‌టీ అరా  త‌ప్పించి.. అన్ని  ర‌కాల  ఎన్నిక‌ల్లోనూ విజ‌య ఢంకా  మోగిస్తూనే వ‌చ్చింది. కేర‌ళ‌లోని ట్రివేండ్రం లోక‌ల్ బాడీ  ఎలక్ష‌న్స్ లో బీజేపీ  విజ‌య దుందుభి మోగించింది. ఈ కార్పొరేష‌న్లో అధికారం చేప‌ట్టింది.  ఇన్నాళ్ల పాటు ఇక్క‌డ హిందుత్వం గానీ ఆర్ఎస్ఎస్ వాదుల‌కుగానీ పెద్ద గొప్ప ఆస్కార‌ముండేది  కాదు.  ఆద‌ర‌ణ ల‌భించేది కాదు. పైపెచ్చు క‌మ్యూనిస్టుల చేతుల్లో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ హ‌త్యాకాండ సైతం  న‌డిచేది. ఇక్క‌డ క‌మ్యూనిస్టుల‌దే రాజ్యం. కానీ ఇప్పుడ‌క్క‌డ సురేష్ గోపీ  రూపంలో ఒక ఎంపీ గెల‌వ‌డం  మాత్ర‌మే కాకుండా.. స్థానికంగానూ స‌త్తా చాటింది బీజేపీ. అక్క‌డా బ్యాలెట్ ఓటింగే  జ‌రిగి ఉంటుంది. మ‌రి  అక్క‌డి గెలుపును వీరంతా  ఎందుకు ఒక ప్రామాణికంగా  తీస్కోరు? అన్న  ప్ర‌శ్న  వినిపిస్తోంది. నిజంగా కాంగ్రెస్ చెప్పిన‌ట్టు ఓట్ చోరీయే జ‌రిగి ఉంటే, స‌ర్ రూపంలో ల‌క్ష‌లాది ఓట్లు పోయి ఉన్న మాట నిజ‌మైతే.. ప్ర‌జ‌లు ఈ ప్ర‌చారాన్ని ఓట‌ర్లు ఎందుకు న‌మ్మ‌డం లేదు? అన్న‌దొక ప్ర‌శ్న‌. రాహుల్ మీడియా ప్రెజంటేష‌న్లు ఇచ్చి.. ఇంత నెత్తీ  నోరు బాదుకున్నా.. జ‌నం  న‌మ్మ‌లేదంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలి? ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదే బ్యాలెట్ల  రూపంలోనే ఇక్క‌డ త‌క్కువ వ‌చ్చిన బీజేపీ, కేర‌ళ‌లో విజ‌య ఢంకా మోగించిన‌దాన్ని ఎందుకు మ‌రుస్తున్నారు? అన్నది కూడా మ‌న‌మంతా ప‌రిశీలించాల్సి ఉందంటారు విశ్లేష‌కులు.

రేవంత్ రెండేళ్ల పాలనకు పాస్ మార్కులే!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దాదాపు దశాబ్దకాలం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పాలన సాగింది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  రేవంత్ సీఎంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయ్యింది.  ఈ రెండేళ్ల కాలంలో   సంక్షేమం, అభివృద్ధితో పాటుగా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడం వంటి అనేక చర్యలతో  రేవంత్ ప్రభుత్వం మంచి మార్కులే సంపాదించింది.     రేవంత్ సర్కార్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన  ఆరు గ్యారెంటీలను అమలుకు చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి  కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ  మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు.  దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా మహిళాలోకం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తున్నది. పరిపాలనలో పారదర్శకత, అవినీతిపై కఠిన వైఖరి కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరిగిందన్నది కూడా జనాభిప్రాయంగా వ్యక్తం అవుతోంది. ఈ సానుకూలతే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి సునాయాస విజయానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే అంత మాత్రాన రేవంత్ సర్కార్ పట్ల జనంలో ఆల్ ఈజ్ వెల్ భావన ఉందని కాదు. ఆయన పాలన పట్ల సానుకూలత, వ్యతిరేకత కూడా సమపాళ్లలో వ్యక్తం అవుతున్నాయి. అంటే కొంచం ఇష్టం, కొంచం కష్టం అన్నట్లుగా ప్రజలు రేవంత్ రెండేళ్ల పాలనను అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రగతి, పురోగతికి ఆర్థిక సవాళ్లు ప్రతిబంధకంగా మారాయి. అయితే ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా వారసత్వంగా వచ్చిందని చెప్పాలి. ఈ అప్పుల భారం కారణంగానే  సంక్షేమ పథకాల పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం నిధుల సమీకరణ కష్ట సాధ్యంగా మారింది. పథకాల అమలు కోసం నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అప్పులు తేవడం, అలాగే భూములు అమ్మడం వంటి నిర్ణయాలు అనివార్యంగా తీసుకోవలసి వస్తున్నది. ఈ క్రమంలోనే  ప్రభుత్వం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన కంచన్‌బాగ్‌ భూముల విక్రయం, ‘హిల్ట్ పాలసీ  వంటి వాటిపై ప్రతిపక్షం నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక పోతే రేవంత్ ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలలో భాగమైన  సామాజిక పింఛన్ల పెంపు,  తులం బంగారం హామీ వంటివి అమలు కాకపోవడం కూడా రేవంత్ సర్కార్ పై విమర్శలకు కారణమయ్యాయని చెప్పారు.   మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, డిసెంబర్‌ 8, 9తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమిట్‌ ల పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా, వాటి ఫలితాలు ఇప్పుడే అంచనా వేయడం కష్టం.    ఇక పల్లెలలో రేవంత్ పాలనపై, మరీ ముఖ్యంగా రైతాంగంలో ఒకింత తక్కువ సానుకూలత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విద్యుత్ కోతలు రైతాంగంలో రేవంత్ సర్కార్ పట్ల వ్యతిరేకతకు కారణమౌతున్నాయని అంటున్నారు.   సీఎంగా రేవంత్ రెడ్డి రెండేళ్ల  పాలనలో ఆర్థిక సవాళ్లు, రాజకీయ పరిమితులు  ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ప్రజలకు చేరువ అయ్యిందనే చెప్పాలి. రైతంగంలో ఉన్న వ్యతిరేకతను మినహాయిస్తే రేవంత్ రెండేళ్ల పాలనకు మంచి మార్కులే పడతాయని పరిశీలకులు అంటున్నారు.  అయితే.. రేవంత్ సర్కార్ బ్రహ్మాండం, అద్భుతం అన్న ఫీలింగ్ కూడా వ్యక్తం కావడం లేదు. రానున్న మూడేళ్ల కాలంలో రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి ఎజెండాతో ఎలా ముందుకు సాగుతారు అన్నది చూడాల్సి ఉంది.  

తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పంచాయతీ ఫలితాల ప్రభావమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ వీడి క్రియాశీల రాజకీయాలలోకి మళ్లీ ప్రవేశిస్తున్నారా? అంటే ఆ పార్టీ శ్రేణులు ఔననే అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఈ తరువాత వరుసగా రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయిన తరువాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. రెండు దశలలోనూ కూడా ఆ పార్టీకి ఎటువంటి సానుకూలతా లభించలేదు. రెండు దశలలోనూ కూడా అధికార కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులే సర్పంచ్ లుగానూ, వార్డు సభ్యులుగానూ అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలహీనతలు ప్రస్ఫుటంగా ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ప్రధానంగా నాయకత్వ లోపం, గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి, ప్రజలతో మమేకమయ్యే నేత లేకపోవడం, అన్నిటికీ మించి కేడర్ కు స్ఫూర్తిని నింపే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ వైరాగ్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలనే తీసుకుంటే ఎన్నికలు జరిగిన దాదాపు 4,000 గ్రామ పంచాయతీలలో..  కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు దాదాపు సగం చోట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.  మొదటి దశలో చతికిల పడిన తరువాత  బీఆర్ఎస్ రెండో దశలోనైనా పుంజుకుంటుందని తిరిగి పుంజుకుంటుందని బీఆర్ఎస్ విశ్వాసంగా ఉంది. పరిశీలకులు సైతం బీఆర్ఎస్ పుంజుకుంటుందనే భావించారు. అయితే అందుకు భిన్నంగా తొలి దశకంటే దారుణంగా ఫలితాలు ఉండటం బీఆర్ఎస్ కు గ్రామీణ స్థాయిలో కూడా మద్దతు కరవైందని తేటతెల్లమైంది.  అన్నిటికీ మించి పంచయతీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ కాంగ్రెస్ కే అనుకూలమని తేలిపోవడంతో  బీఆర్ఎస్ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నడుంబిగించి రాజకీయ రణక్షేత్రంలో దిగక తప్పదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. రాష్ట్రంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం నుంచి బీఆర్ఎస్ బయటపడాలంటే కేసీఆర్ మళ్లీ క్రియాశీలంగా ప్రజా క్షేత్రంలోకి రావలసిన అవసరం ఉందని అంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అడుగులు ఆ దిశగా పడుతున్నా యనడానికి సంకేతంగా  కేసీఆర్ ఈనెల 19న తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎల్ పి నేతలతో చర్చించనున్నారు. అలాగే  తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాలు, పార్టీ సంస్థాగత విధానాలపై నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

క‌మ‌లానికి కిష‌న్ మార్క్.. చీడ ప‌ట్టిందా?

  తెలంగాణ బీజేపీలో అస‌లేం  జ‌రుగుతోంది? మ‌నం నానాటికీ ఇక్క‌డ  ఎందుకు దిగ‌జారిపోతున్నాం? అంటూ ప్ర‌ధాని మోదీ వాక‌బు చేశారంటే ఇక్క‌డి  పార్టీ ప‌రిస్థితి  ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఇంత‌కీ  తెలంగాణ బీజేపీ ప్ర‌స్తుతం ఎలా ఉంది? అంటే రాజాసింగ్ ఉదంత‌మే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. రాజాసింగ్ పార్టీలోని  ప్ర‌తి అంశాన్ని బ‌య‌ట  పెడుతూనే వ‌చ్చారు. ఇంకా అదే ప‌ని మీదున్నారాయ‌న‌.  రాజాసింగ్ మాట‌ల‌ ప్ర‌కారం చూస్తే, పార్టీ వ్య‌క్తి కోసం  న‌డుస్తోన్న వ్య‌వ‌స్థ కాదు అవ‌స్థ‌గా  తయారైన‌ట్టు తెలుస్తోంది. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు కిష‌న్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్. కిష‌న్ ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నా.. ఆయ‌న ఆడింది ఆట  పాడింది పాటగా పార్టీలో చ‌లామ‌ణీ అవుతున్న‌ట్టు కొడుతోంద‌ని అంటారు రాజాసింగ్. ఒక‌ప్పుడు తెలంగాణ బీజేపీకి  ఇటు కిష‌న్ తో పాటు ద‌త్త‌న్న‌, ల‌క్ష్మ‌న్న అనే ఇద్ద‌రు సీనియ‌ర్లు త్రిమూర్తుల్లా  క‌నిపించేవారు. ద‌త్త‌న్న దాదాపు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ బీజేపీ అంత‌ర్గ‌త  రాజ‌కీయాల‌కు బాగా దూరంగా ఉన్నారు.  కిష‌న్ ఒక్క‌డే ప్ర‌స్తుతం దిక్కు మొక్కుగా  ఉన్నారు. ప్రెజంట్ కిష‌న్ కి బండి సంజ‌య్ రూపంలో మ‌రో నాయ‌క‌త్వం తోడున్న‌ట్టే క‌నిపించినా.. అందులోనూ ఏమంత  బండి మార్క్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక్క‌డ  కిష‌న్ మార్క్ ప‌రిపాల‌నే అధికంగా  కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. పేరుకు రామ‌చంద్ర‌రావు పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నా.. ఆల్ ఇన్ వ‌న్ గా కిష‌న్ త‌న‌దైన క‌మ‌ల  చ‌క్ర వ్యూహం ర‌చిస్తూనే  ఉన్నార‌ట‌. కిష‌న్  కేంద్ర మంత్రి కావ‌డంతో కొంత  బిజీ బిజీగా ఉన్నమాట వాస్త‌వ‌మే  అయినా... పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో మాత్రం త‌న ప‌ట్టు కోల్పోకుండా జాగ్ర‌త్త  వ‌హించ‌డంతోనే అస‌లు ముప్పు త‌లెత్తిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇక్క‌డ ఎవ‌రికి వారే యుమ‌నా తీరే  అన్న‌ట్టుగా  త‌యారైందట‌. అంత‌ర్గ‌త  ప్ర‌జాస్వామ్యం అనే  విష‌యంలో ఈ 40 ఏళ్ల పార్టీ ఏకంగా 140 ఏళ్ల‌ కాంగ్రెస్ తో పోటీ  ప‌డుతోందంటున్నారు కొంద‌రు క‌మ‌ల‌నాథులు. మోడీ అడుగుతున్న‌ట్టు.. బీజేపీ ప‌త‌నం ఎలా ప్రారంభ‌మ‌య్యిందో చూస్తే.. నాడు బీఆర్ఎస్ అధికార పార్టీగా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండ‌గా.. ఆ త‌ర్వాతి స్థానంలో ప్ర‌జ‌ల దృష్టిలో నిలిచిన పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ ఎక్క‌డో మూడో స్థానంలో ఉన్న‌ట్టు క‌నిపించింది. అయితే ఇటు క‌ర్ణాట‌క ఫ‌లితాలు రావ‌డంతో కాంగ్రెస్ లో ఒక ర‌క‌మైన జోష్ మొద‌లైంది.  మ‌న పొలంలోనూ మొల‌కలొస్తాయ్ అన్న ఆశ ఇక్క‌డి హ‌స్తంపార్టీ  నేత‌ల్లో చిగురించ‌డం మొద‌లైంది. దీంతో అప్ప‌టి  వ‌ర‌కూ అసంఘటితంగా  ఉన్న  కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులంతా ఒక్కసారిగా చేయి చేయి క‌లిపారు. ఫ‌లితంగా 2023 అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ బీజేపీ మూడో స్థానానికి ప‌డిపోయి.. అక్క‌డే స్థిర‌ప‌డిపోయింది. ఇక్క‌డ బీజేపీ ప‌త‌నానికి మ‌రో కీల‌క‌మైన  కార‌ణం  క‌విత  వ్య‌వ‌హారంగానూ  చెబుతారు. క‌విత‌ను అరెస్టు చేయ‌కుంటే బీఆర్ఎస్, బీజేపీ  కూడ‌బ‌లుక్కుంటున్నాయిన  జ‌నం అనుకుంటున్న‌ట్టు ఒకానొక‌ అనుమానం వ్య‌క్తం చేశారు కొండా  విశ్వేశ్వ‌ర్ రెడ్డి అప్ప‌ట్లో. దీనికి తోడు ఆనాడు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా  బండి సంజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. నాలుగు సీట్ల గ్రేట‌ర్ ని 48 సీట్ల వ‌ర‌కూ లాగారు. దీంతో బీజేపీలో కొత్త  ర‌క్తం వ‌చ్చింద‌ని  పాత ర‌క్తం క‌నుమ‌రుగ‌య్యింద‌నే అనుకున్నారంతా. ఇలాగైతే  త‌న బండార‌మంతా బ‌ట్ట‌బ‌య‌లై  పోతుంద‌ని భావించిన కిష‌న్, మోడీతో త‌న‌కున్న సాన్నిహిత్యాన్ని వాడి.. ఎలాగోలా రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. కిష‌న్ పై రాజాసింగ్ చేసే ఆరోప‌ణ‌ల‌ను బ‌ట్టీ చూస్తే ఆయ‌న  ఎన్న‌టికీ  పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకోరు. ఎవ‌రు అధికారంలో ఉంటే వారితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని.. వ్య‌క్తిగ‌త ల‌బ్ధి పొంద‌డానికే ఎక్కువ ప్ర‌యారిటీ  ఇస్తార‌ని అంటారు. దీంతో కేసీఆర్ కి అనుకూల కిష‌న్ రెడ్డి రావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్ర క‌మ‌ల‌ద‌ళంలో ఉన్న జోష్ మొత్తం నీరుగారిపోయిన‌ట్టు అంచ‌నా. అప్ప‌టికీ.. రాష్ట్రంలో బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఆద‌ర‌ణ కొద్దీ ఇటు ఇద్ద‌రు సీఎం అభ్య‌ర్ధులు పోటీ చేసిన కామారెడ్డిలో ఢంకా  బ‌జాయించ‌డంతో పాటు మొత్తం ఎనిమిది చోట్ల అసెంబ్లీ  స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఆపై 2024 లోక్ స‌భ  ఎన్నిక‌ల్లోనూ స‌త్తా  చాట‌డంతో 8 ఎంపీల‌ను గెల‌వ‌గ‌లిగింది. ఇక  ఎమ్మెల్సీల ప‌రంగానూ  గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. స్థానిక సంస్థ‌ల్లోనూ  ప్ర‌భావం చూపించాల్సిన క‌మ‌లం పార్టీ చ‌తికిల ప‌డింది. కిష‌న్ రెడ్డి పుణ్య‌మాని.. పార్టీలో ఎక్క‌డిక్క‌డ బ్యాచ్ లు గా విడిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇటు ఎంపీలు ఒక గ్రూప్, ఎమ్మెల్యేలు మ‌రో గ్రూప్, ఆపై సీనియ‌ర్లు ఒక గ్రూప్, కొత్త‌గా  వ‌చ్చిన వారు ఇంకో గ్రూప్ లుగా విడిపోయి.. ప్ర‌స్తుతం ద‌శ- దిశ..  క‌ర‌వై నానా  అగ‌చాట్లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం గుర్తించిన ప్ర‌ధాని మోడీ రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం  చేయ‌డం ఒక స్వ‌యంకృతాప‌రాధం.  ఎందుకంటే  కిష‌న్ రెడ్డి స్వ‌భావం గురించి తెలిసి కూడా  పార్టీలోని  ప్ర‌తి ఎంపిక క‌ద‌లిక‌ల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షించేలా చేయ‌డంతోనే అస‌లుకే మోసం వ‌చ్చేలా  క‌నిపిస్తోంద‌ని వాపోతున్నారు రాజాసింగ్ వంటి వారు. అస‌ల‌క్క‌డ ఉన్న‌ది భార‌తీయ  జ‌న‌తాపార్టీ కాదు.. కిష‌న్ రెడ్డి  జ‌న‌తా పార్టీ అంటారు రాజాసింగ్. మ‌రి  ఈ విష‌యాలేవీ మోడీకి తెలీద‌నుకోవాలా? ఏంట‌న్న‌ది  పార్టీ  అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ట్టు తెలుస్తోంది.