సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి..
posted on May 31, 2025 @ 9:30AM
సీజన్ మారుతున్నప్పుడు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి వాతావరణం మారినప్పుడు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, సరైన జీవనశైలి పాటించడం ముఖ్యం. ఇందుకోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి. ప్రస్తుతం వేసవి కాలం సాగుతున్నా.. వర్షాలు పడుతూ వాతావరణం చాలా డిస్టర్బ్ గా ఉంటోంది. వర్షాలు వేసవిలో ఊరట అనిపిస్తాయి కానీ వీటి వల్ల కలిగే సమస్యలు కూడా ఉంటాయి. ఈ వాతావరణ మార్పులలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
పరిమిత ఆహారం తీసుకోవాలి.
హైడ్రేట్‌డ్‌గా ఉండాలి. వాతావరణం చల్లగా ఉంది కదా అని నీరు తగ్గించకూడదు.ఎక్కువ నీరు త్రాగాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. విటమిన్ C ఎక్కువగా ఉన్న ఆహారం (లేత నిమ్మకాయ, ఉసిరికాయ, కివి, నారింజ) శరీర రక్షణ శక్తిని పెంచుతుంది. వేడి లేదా బరువుగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవాలి (ముఖ్యంగా ఈ వేసవిలో). చల్లటి పదార్థాలు (ఐస్ క్రీమ్, చల్లని పానీయాలు) ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం పై ప్రభావం చూపొచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో
వాతావరణ మార్పులకు అలవాటు పడటం మంచిది.
ఉదయం సూర్యోదయ సమయానికి బయట తిరగడం మంచిది. ఇది శరీరానికి డే-నైట్ సైకిల్‌ను స్థిరపరుస్తుంది. బయట ఉష్ణోగ్రత ప్రకారంగా దుస్తులు ధరించండం వల్ల చాలా మంచి ఉపశమనం ఉంటుంది.
వ్యాయామం & యోగా చేయడం మరచిపోకూడదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేయాలి. “ప్రాణాయామం” లాంటి శ్వాస వ్యాయామాలు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచిది.
నిద్ర – విశ్రాంతి విషయంలో చాలా కేర్ గా ఉండాలి. ప్రతి రోజు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రిళ్లు ఆలస్యంగా మేలుకుని ఉండకూడదు. ఇది శరీర రక్షణ శక్తిని తగ్గిస్తుంది.
హైజెనిక్ గా ఉండాలి. శుభ్రత, స్వచ్చత పాటించడం చాలా ముఖ్యం. తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. బయట తినే ఆహారం తగ్గించాలి. ఇంటి ఆహారమే చాలా ఆరోగ్యం.
ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచిది. రోజూ ఉదయం ఉసిరికాయ పౌడర్ లేదా "చ్యవనప్రాశ్" తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి, అల్లం, మిరియాలు, తేనెతో చేసిన కషాయం చలికాలంలో ఉపయోగపడుతుంది. సీజనల్ సమస్యలను సమర్థవంతగా ఎదుర్కుంటుంది.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...