ఊపిరితిత్తులు బలంగా మారడానికి ఏ ఆహారాలు తినాలి?
posted on Jun 16, 2025 @ 9:30AM
ఊపిరితిత్తులు మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మానవ శ్వాసక్రియ ఊపిరితిత్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. ఊపిరితిత్తులు బలంగా ఉండటం ఆరోగ్యానికి చాలా కీలకం. ముఖ్యంగా వాయువుల మార్పిడి, శ్వాస సంబంధిత వ్యాధులు నివారించడానికి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలు చక్కగా సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు..
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఆహారాలలో గ్లూకోసినోలేట్లు ఉండి శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచుతాయి.
బేరీ జాతి పండ్లైన స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C ఎక్కువగా ఉండి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి.
టమోటాలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో లైకోపిన్ ఉండి ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
విటమిన్ C, E పుష్కలంగా ఉన్న ఆహారాలు..
నిమ్మకాయ, మామిడికాయ, కమలాపండు, పైనాపిల్, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, గోధుమ మొలకలు (Vitamin E కు) మొదలైన ఆహారాలు తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు..
ఫ్యాటీ ఫిష్ (salmon), అవిసె గింజలు, చియా విత్తనాలు మొదలైనవి తీసుకోవాలి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఊపిరితిత్తుల ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి.
ఔషధ గుణాలు ఉన్న ఆహారాలు..
అల్లం శ్వాసనాళాల కణతులు, శ్వాసనాళంలో అడ్డంకులు తొలగించడంలో సహాయపడుతుంది.
పసుపులో ఉండే కర్చుమిన్ వలన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
తులసి ఆకులు వాడటం వల్ల బ్రాంకైటిస్, ఆస్థమా వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
పచ్చి ఆకుకూరలు..
పాలకూర, కొర్రగుండ కూర, మునగ ఆకులు మొదలైన ఆకులలో విటమిన్ A, K, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఊపిరితిత్తుల కణాల పునర్నిర్మాణానికి ఇవి సహాయపడతాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల లోని మ్యూకస్ తొలగిపోతుంది.
ధూమపానం చేసే అలవాటు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అందుకే ధూమపానం నివారించాలి.
వ్యాయామం, ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. రోజులో కొంత సమయం వీటికి కేటాయించాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...