రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..!
posted on Jan 19, 2026 @ 2:08PM
సీజన్ ను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి. అయితే రేగు పళ్లను ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు రేగు పళ్లను తినకూడదట. అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే..
సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి. ఆరోగ్యం బాగుండాటంటే సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. శీతాకాలంలో లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు. ఇవన్నీ చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు.
కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.
ఎవరు తినకూడదంటే..
మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి.
కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహేడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అప్పటికే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది.
గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.
కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. అలర్జీ సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండటం మంచిది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...