అమ్మకి బూటు లేసు కట్టిన రాహుల్.. భారత్ జోడో యాత్రలో సోనియా
posted on Oct 7, 2022 8:23AM
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాహుల్ గాంధీ భాతర్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో ఆమె ప్రజల మధ్యకు రావడం ఇదే ప్రథమం. కర్ణాటక మండ్య జిల్లాలో రాహుల్‌తో కలసి సోనియా పాదయాత్ర చేశారు.
రాహుల్ తన తల్లికి ఆసరాగా కాసేపు ఆమె భుజం చుట్టూ చేయి వేసి నడిపించారు. విజయదశమి సందర్భంగా రెండు రోజుల విశ్రాంతి తర్వాత రాహుల్ పాదయాత్ర పునఃప్రారంభమైంది. తల్లి భుజం చుట్టూ చేయి వేసి నడుస్తున్న ఫొటోను రాహుల్ ట్వీట్ చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత సోనియా గాంధీ ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటి సారి.
పాదయాత్రలో నడుస్తుండగా సోనియా షూలేసులు ఊడిపోయాయి. దీంతో ఆమె నడవడానికి ఒకింత ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన రాహుల్ గాంధీ వెంటనే ఆమె షూ లేసులు కట్టారు. ఈ దృశ్యం పాదయాత్రలో పాల్గొన్న వారందరినీ కదిలించివేసింది. అమ్మంటే రాహుల్ కు ఎంత ప్రేమ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.