లోక్ సభలో నిద్రపోయిన రాహుల్
posted on Jul 10, 2014 @ 10:39AM
బుధవారం లోక్ సభ సమావేశాలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ కీర్తించిన రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోతూ కెమెరాకి చిక్కారు. ఒక పక్క ధరల పెంపు విషయంలో సభలో వాడివేడిగా చర్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ తనకు సంబంధమే లేదు అన్నట్లు కునుకేశారు! ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.'దేశంలో ధరల పెరుగుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది. ఇప్పుడు ఆ అంశం మీద చర్చ జరుగుతుంటే ఆ పార్టీ యువరాజు నిద్రపోయారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ అదే చేస్తోంది’ అని బిజెపి విమర్శించింది. కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చారు. సభలో కళ్ళు మూసుకుని కూర్చున్న౦త మాత్రాన నిద్రపోయినట్లు కాదని, కొందరు చర్చను జాగ్రత్తగా వినేందుకు కళ్లు మూసుకుంటారని గుర్తు చేశారు.