అర్జున్ అవతారంలో రాహుల్ గాంధీ..
posted on Sep 13, 2016 @ 6:08PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పుడూ వివాదాలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై వచ్చిన పోస్టర్ తాజాగా వివాదాస్పదమైంది. పోస్టర్ కే వివాదం అవ్వడం ఏంటనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. ఈ పోస్టర్లో రాహుల్ గాంధీని అర్జున్ అవతార్ గా అభివర్ణించారు. అసలు సంగతేంటంటే.. రాహుల్ గాంధీ ప్రారంభించిన మహాయాత్రలో భాగంగా ఆయన అలహాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ నగరంలోని సుభాష్ చౌరస్తా సహా ప్రధాన వీధుల్లో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ పోస్టర్లో అర్జున్ అవతార్‌గానూ, యుగ్ పురుష్‌గానూ అభివర్ణిస్తూ పోస్టర్ తయారుచేశారు. ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. కాగా ఇంకా ఈ పోస్టర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంక వాద్రా, యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారీ, అమేథీ ఎంపీ రాహుల్‌గాంధీల ఫొటోలతోపాటు కాంగ్రెస్ నేతలు హసీబ్ అహ్మద్, శిరీష్ చంద్ర దుబే, కాదిర్ భాయ్ తదితరుల ఫొటోలు కూడా ముద్రించారు.