గోల్డె మెన్ ఇక లేడు..
posted on Jul 15, 2016 @ 5:39PM
గోల్డ్ మెన్ ఈ పేరు వినే ఉంటారు. దత్తాత్రేయ అనే వ్యక్తి బంగారంతో తయారు చేసిన 3.5 కిలోల చొక్కాను ధరించి ఫేమస్ అయ్యాడు. అప్పటి నుండి ఆయన పేరు గోల్డె మెన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగలు ఆయనను అతికిరాతకంగా కొట్టి చంపారు. వివరాల ప్రకారం... దత్తాత్రేయ వక్రతుండ చిట్ ఫండ్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. అయితే ఈయన అనేక మంది ఖాతాదారుల నుండి కోట్ల రూపాయలు డబ్బు వసూలు చేశాడు. అంతేకాదు ఈయనపై పలు అక్రమాలకు పాల్పడినట్టు కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి దుండగులు ఆయనపై దాడి చేసి రాళ్లతో కొట్టి, పదునైన ఆయుధాలతో పొడిచి చంపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో దత్తాత్రేయ మేనల్లుడూ కూడా ఉన్నాడు.
మరోవైపు ఆతని భార్య సీమా.. అర్ధరాత్రి కొంతమంది వచ్చి తన భర్తను తీసుకెళ్లారని.. భారతమాత నగర్ కు తీసుకెళ్లి తన భర్తను హత్య చేశారని వెల్లడించింది.