చిరుకు సిఎం అయ్యే యోగం లేదా?
posted on Aug 4, 2012 @ 11:01AM
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి సిఎం అవుతారన్న మాటే అచ్చిరానట్లుంది. ఇది ఒక్కరి వ్యాఖ్యానం కాదు ఆయన మౌనమే దీనికి అద్దం పడుతోంది. ఏదో సాధిద్దామని ప్రజారాజ్యంపార్టీ ద్వారా రాజకీయం తెరంగేట్రం చేసిన ఈ మెగాస్టార్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న సీట్లు గెలవ లేకపోయారు. దీంతో నిరుత్సాహానికి గురైన చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
ఆ ఎన్నికల సమయంలోనూ చిరంజీవి ముఖ్యమంత్రి అయి కాపుసామాజికవర్గ నేతగా మరో పెద్ద గుర్తింపునందుకుంటారని పలువురు ఆశించారు. అందుకే పార్టీ ప్రారంభం నుంచి దాన్ని కాపు సామాజికవర్గ పార్టీగా దాన్ని తీసుకువచ్చారు. అలానే సెంటిమెంటుపరంగా భిన్నమైన ధోరణులతో చిరు వ్యవహరించారు. సాయంత్రం వేళ వికలాంగుని చేత పార్టీ జెండాను ఆవిష్కరింపజేయటమే ఆయన పతనానికి కారణమైందని జ్యోతిష్యపండితులు హెచ్చరించారు. ఈ ఒక్క పని వల్ల ఆయన సిఎం అయ్యే అవకాశాన్ని కోల్పోతారని జ్యోతిష్కులే తేల్చిచెప్పారు. దీంతో సిఎం పదవి ఎలాగూ రాదు కాబట్టి ఓ మంచి పొజిషన్ వస్తే చాలని పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనూ చిరంజీవి సిఎం అవుతారని ఆశలు పెంచుతున్నారు. జ్యోతిష్యుల హెచ్చరికల నేపథ్యంలోనే చిరంజీవి దీనిపై పెదవి విప్పటం లేదని, ఆయన ఆశించికుండా ఉన్నప్పుడే అవకాశాలు వస్తాయన్న జ్యోతిష్కుల సూచనలు పాటిస్తున్నారని చిరుసన్నిహితులు అంటున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే మౌనానికి మించిన మార్గం లేదని చిరంజీవి భావిస్తున్నారు.