ఆ 40 మంది జడ్జీల పదోన్నతులను రద్దు!
posted on May 17, 2023 @ 10:01AM
గుజరాత్ లో వివాదానికి దారితీసిన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవ హారంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 68 మంది జడ్జీలకు ఇచ్చిన పదో న్నతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మందికిచ్చిన పదోన్నతులను కొనసాగిస్తూనే వారికి స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు రెండు నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. మిగిలిన ఏడుగురు న్యాయమూర్తుల విషయాన్ని వెల్లడించలేదు. ఈ నెల 12న జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రక్రియపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మకు ఇచ్చిన పదోన్నతిని మాత్రం హైకోర్టు కొనసాగించింది. అయితే, తొలుత ఆయనకు రాజ్కోట్ లోని 16వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ ఇవ్వగా ఇప్పుడు 12వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమించింది.
సుప్రీంకోర్టు గుజరాత్ లో వివాదాస్పదమైన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవహారంపై జులైలో విచా రణ జరిపేందుకు అంగీకరించింది. వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నర సింహ, జస్టిస్ జె. బి. పార్దీవాలతో కూడిన ధర్మా సనం తెలిపింది. ప్రతిభ, సీనియారిటీ ఆధారం గానే పదోన్నతి కల్పించా లన్న సర్వీసు నిబంధన లను గుజరాత్ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ జస్టిస్ ఎం. ఆర్.షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 12న జడ్డీల పదోన్నతలుపై స్టే విధించిన సంగతి తెలిసింేద. ప్రమోషన్లు పొందిన వారంతా తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.
జస్టిస్ ఎం.ఆర్. షా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయితే, పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పిదమేమీ లేకున్నా అవమానాలకు గురి కావాల్సి వచ్చిందంటూ కొందరు జడ్జీలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును జులైలో విచారణకు చేపడతామని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధించిన న్యాయమూర్తికి పదోన్నతి కలిపించడం ఇప్పటికే వివాదాస్పద అంశంగా మారిన నేపథ్యంలో.. ఆయనకు పదోన్నతి స్తంభన విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు న్యాయస్థానాలు కూడా ప్రభావితం అవుతున్నాయనే విమర్శలు వస్తున్న తరుణంలో... తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలమేర గుజరాత్ హైకోర్టు నిర్ణయం హర్షించదగినదని పలువురు అభిప్రాయపడుతున్నారు.