ప్రియాంక గాంధి కూతురు ఓ ఆట ఆడుకుంటోంది
posted on Feb 3, 2016 @ 1:51PM
ప్రియాంక గాంధి అంటే దేశంలో తెలియనివారుడరు. రాహుల్ గాంధీని తప్పించి పార్టీ పగ్గాలను ప్రియాంకకు అప్పగించమని అడుగుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు! ప్రియాంక రాజకీయాలలో ఎంతవరకు రాణిస్తారో లేదో తెలియదు కానీ ఆమె కూతురు మాత్రం ఇప్పడు క్రీడలలో తెగ వెలిగిపోతున్నారు. పుదుచ్చేరిలో జరుగుతున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీలలో ఇప్పడు అందరి చూపు ‘మిరాయా వాద్రా’ వైపే ఉన్నాయి. ప్రియాంక, రాబర్ట వాద్రాల గారాలపట్టి అయిన మిరాయా ఈ పోటీలలో హర్యానాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో హర్యానా జట్టు తమిళనాడు జట్టు ముందు చిత్తుగా ఓడిపోయినా, రెండో లీగ్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ జట్టు మీద ఆధిపత్యం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ మిరాయా వాద్రా చురుకుగా ఆడారని ప్రేక్షకుల అంటున్నారు. మిరాయా ఆట తీరుని చూడటానికి ప్రియాంక కూడా పుదుచ్చేరికి చేరుకున్నారట. గత ఏడాది జరిగిన రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలలో మిరాయా తొలిసారి మీడియా ముందుకి వచ్చారు. కేవలం ప్రియాంక కూతురుగానే ఆమెను అప్పట్లో భావించారు. ఇప్పడు క్రీడాకారిణిగా రెండోసారి కనిపిస్తున్నారు. మున్ముందు రాజకీయవేత్తగా కూడా మిరాయాను చూడాల్సి ఉంటుందేమో!