కేసీఆర్ సారూ.. జర కాపాడు..
posted on Apr 6, 2021 @ 2:33PM
అతని పేరు గడప చంద్రశేఖర్. ప్రైవేట్ బడి పంతులు. అతనికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొడుకు ఆరోగ్యం బాలేదు. కుటుంబం గడవడం కోసం అతని భార్య బీడీలు చుడుతోంది. చాలి చాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్నాడు. కరోనా వల్ల ఆ బడి పంతులు బతుకు బండి కి బ్రేక్ పడింది. కరోనా అందరి పొట్ట కొట్టినట్లే బడిపంతులు పొట్ట పై వేటు పడింది. బతుకు బండి నెట్టుకురావడానికి అప్పు చేశాడు. లోన్ లో బైక్ తీసుకున్నాను. ఈఎంఐలు కూడా కట్టలేక పోతున్నాను సర్ అంటూ కేసీఆర్ ని వేడుకున్నాడు. ఆ బాధల నుండి బయట వేయమని బతిమాలుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ దుస్థితి వివరిస్తూ వీడియో రూపొందించారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
మా భార్య, పిల్లలకు రెండు పూటలా తిండి పెట్టే స్థితి లేక పస్తులు ఉంటున్నాం. మమ్మల్ని ఆదుకోండి, కాపాడండి, మాకు జీవితాన్నివ్వండి సార్. మా కుటుంబం కూడా మరో సునీల్ కుటుంబంగా మారకముందే.. మా కుటుంబం ఆత్మహత్యలు చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి సార్. మమ్నల్ని కాపాడే బాధ్యత మీదే సార్. మీరు మమ్నల్ని కాపాడితే మీకు శాశ్వతంగా రుణపడి ఉంటాం సార్. అని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ని కోరాడు.