భార్యను మర్డర్.. డాటర్ పై టీచర్..
posted on May 8, 2021 9:21AM
సదుకున్నోడి కంటే అదేదో కులం వాడు మేలు అన్నట్లు ఉంది. సమాజం లో అక్షర జ్ఞానం లేని వాడు ఏదైనా నేరం చేస్తే అజ్ఞానం లో చేశాడు అని అనుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు చేస్తే.. ఆ చదువుకు అర్ధం ఏంటి..? అది కూడా అజ్ఞానమే అనాలా.. లేక విజ్ఞానం ఎక్కువై వికృతం చేశాడు అనాలా... ఈ ప్రపంచంలో లో మనిషి జీవితం చాలా ఉన్నతమైనది. కానీ ఆ మనిషి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. అర్ధాన్ని మారుస్తున్నారు. చివరికి మనిషి మానవత్వాన్ని మారుస్తున్నాడు. బంధాలను వీడుతున్నాడు. వరసలు మరిచి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. బహుశా అంతమవ్వడానికి అనుకుంటాను. తన రక్తం పంచుకుని పుట్టిన వారి పైనే వంకరగా ప్రవర్తిస్తున్నాడు. తల్లి, చెల్లి, కూతురు అని తేడాలేకుండా అత్యాచారానికి పాలుపడుతున్నాడు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి.
మీ అమ్మను చంపేశా. నిన్నూ చంపేస్తా. తర్వాత నేను చచ్చిపోతా’.. ఎక్కడో సినిమాలో డైలాగ్ లా ఉందనుకుంటున్నారా..? కానే కాదు.. ఈ మాటలు ఎవరో ఆగంతుకుడు, అపరిచితుడు అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఓ కసాయి తండ్రి తన కుమార్తెతో అన్నవి. మాటలతో సరిపెట్టు కోవడమే కాదు. అన్నంత పని చేసి చివరికి కట్టుకున్న భార్యను కడతేర్చిన ఆ పైశాచికుడు.. ఆ తరువాత కన్న కూతురిపై హత్యాయత్నానికి పాల్పడుతూ.. స్థానికులు రావడాన్ని గుర్తించి.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
ఓపెన్ చేస్తే అది నెల్లూరు. బాలాజీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని వాకముళ్లవారిపాలేనికి చెందిన బ్రహ్మారెడ్డికి ఏఎస్‌పేట మండలం శ్రీకొలను గ్రామానికి చెందిన రమణమ్మ(46)తో 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఖ్యాతి లక్ష్మీశాయి ఈశ్వరి అనే కుమార్తె ఉంది. బ్రహ్మారెడ్డి తన కుటుంబంతో కలిసి ఆరేళ్లకిందట నెల్లూరుకు వచ్చారు. ఎన్టీఆర్ నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.. దాన్ని మానేసి వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. తెలిసివారికి అప్పులు ఇచ్చేవాడు. కొందరు తీసుకున్న నగదు చెల్లించకపోవడంతో వ్యాపారంలో నష్టాలొచ్చాయి. నగదు విషయమై భార్యభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఘర్షణలు కూడా జరిగాయి. ఇటీవల బ్రహ్మారెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు నగదు విషయమై భార్య ఒత్తిడి తాళలేక... చంపేస్తానని తల్లి, కుమార్తెను బెదిరించడం ప్రారంభించాడు.
కట్ చేస్తే.. ఆ క్రమంలోనే శుక్రవారం రమణమ్మ హాలులో నిద్రిస్తుండగా- ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం జ్వరంతో బాధపడుతూ పడకగదిలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లి.. ‘మీ అమ్మను హత్య చేశా.. నిన్ను చంపేస్తా’నంటూ దాడి చేశాడు. అప్రమత్తమైన ఆమె.. తండ్రి నుంచి తప్పించుకుని కిందకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని అక్కడున్న వారికి, బంధువులకు తెలిపింది. ఇంతలో బ్రహ్మారెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ మేరకు హతురాలి కుమార్తె ఖ్యాతి లక్ష్మీశాయి ఈశ్వరి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిని హత్య చేసిన తండ్రిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఇన్‌స్పెక్టర్ మంగారావు, ఎస్సై అంకమ్మ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.