ఇదెక్కడి న్యాయం పెద్దయనా?
posted on Nov 2, 2013 @ 7:01PM
రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ని పోగొట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తన విచక్షణని ఎంతమాత్రం ఉపయోగించుకుండా, సోనియాగాంధీ చెప్పినవాటికి తలుపుతూ ఆయన తెలుగువారి అభిమానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ముజఫర్ నగర్‌లో జరిగిన అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మట్లాడి అందరిచేతా తలంటు పోయించుకున్న విషయం తెలిసిందే. ఆ ముజఫర్ నగర్‌లోనే రెండు రోజుల క్రితం స్పల్ప ఘర్షణలు జరిగాయి. దేశంలో మరే సమస్యా లేనట్టు ప్రధాని మన్మోహన్ ఆ ఘర్షణల మీద వెంటనే స్పందించారు. ఆ స్పందన వెనుక బీజేపీని తక్కువ చేయాలనే ఉద్దేశమే ఉన్నట్టు కనిపించింది. ఘర్షణల మీద ప్రధాని స్పందిస్తూ, సమాజాన్ని కొంతమంది మతం, కులం, వర్గాలుగా విభజిస్తున్నారని వాపోయారు. పాపం పెద్దాయన బాగానే వాపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాంతం పేరున విభజిస్తోంది. మరి దీనిమీద స్పందించడం మన్మోహన్ సింగ్ సాబ్‌కి తెలియదా? ఇదెక్కడి న్యాయం పెద్దాయనా?