గ్యాస్ కాదు.. నిజం!
posted on Nov 2, 2013 @ 6:56PM
ఇది నమ్మలేని నిజం.. గ్యాస్ సిలెండర్ల ధర తగ్గింది. గ్యాస్ సిలెండర్ ధరని ఇంకో రెండు మూడు వందలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఈమధ్యే వార్తలు వచ్చాయి. ఆ బాంబు ఎప్పుడు నెత్తిన పడుతుందా అని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి టైమ్‌లో గ్యాస్ సిలెండర్ల ధరలు తగ్గిస్తున్నామని చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇళ్ళలో ఉపయోగించే సిలెండర్ల ధర 53.50 రూపాయలు తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలెండర్ల మీద 91 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గ్యాస్‌కి, ఆధార్ కార్డుకి లింకు పెట్టిన తర్వాత గ్యాస్ వినియోగారులు విన్న తొలి శుభవార్త ఇది. దీపావళి పండగ సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు లభించిన కానుకగా ఈ తగ్గింపును వినియోగదారులు భావిస్తున్నారు. ఇంతకీ ఈ తగ్గింపుడు నిజంగానే తగ్గింపుడా.. లేక తుఫాను ముందు ప్రశాంతత లాగా భవిష్యత్తులో జరిగే భారీ పెరుగుదలకి ముందు ఊరటా?