కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
posted on Oct 24, 2025 @ 10:23AM
మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన పీఎం
కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న
కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులు పూర్తిగా, తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బస్ దగ్ధమై 20మందికిపైగా సజీవ దహనం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీఐటీ మంత్రి లోకేష్ కూడా బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వైసీపీ అధినేత జగన్ కూడా బస్సు ప్రమాద ఘటనలో 20 మంది మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొంటూ, సానుభూతిని తెలియ జేశారు. బాధితులను ప్రబుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.