ముందస్తుకు సిద్ధం కండి... చంద్రబాబు
posted on Nov 3, 2022 @ 11:34AM
ఇక సమరానికి సిద్ధపడాల్సిన సమయం మరింత ఆసన్నమయింది.. అందరూ చేతికి అందిన వస్తువు ను ఆయు ధంగా చేసుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేయండి.. అంటూ అదేదో సినిమాలో రెండో హీరో పెద్ద డైలాగు.. ఊరు ఊరంతా ఒకే అనేస్తారు.. రాళ్లు రప్పా కూడా పదును పెట్టడంలో నిమగ్నమవుతారు. ఇక యుద్ధమే, విజయమే.. అన్న స్థాయిలో నాయకుడికి జేజేనాదాలు పలుకుతా రు. తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులు, అభిమానులను అందర్నీ రాబోయే ఎన్నికలకు మరింత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీ ఆర్ జిల్లా టీడీపీ కార్య కర్తల సమావేశంలో మాట్లాడుతూ, అనుకున్నదాని కంటే మరింత ముందుగానే ఈసారి ఎన్నికలు జరి గేందుకు అవకాశం ఉందిగనుక పార్టీ విజయానికి అవసరమైన కార్యక్రమాలు, జనాన్ని సమాయత్తం చేయడంలో నాయకులు మరింత పదునుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నిజవే.. సమయం ఆసన్నమయిందనే ప్రజలూ అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రజాహితంగా నడవడం కంటే ప్రజాకంటకంగా మారిందనే అభిప్రాయాలు, నినాదాలే అంతటా వినపడుతున్నాయి. ఏ రంగంలోనూ పిసరంత మార్పు, అభివృద్ధి జరగలేదు. కేవలం విపక్షాల మీద విరుచుకుపడటం, నోటదూల తీర్చుకోవడం తప్ప ప్రత్యేకించి ప్రజాహితంగా ఈ పనిచేస్తున్నాం, చేశా మని చెప్పలేని స్థితిలో జగన్ సర్కార్ ఉంది. ప్రజలు కూడా మూడేళ్ల పాలనలో విసిగెత్తారన్నది వారి వ్యతిరేకతే తెలియజేస్తోంది. అధికారంలోకి రావడినికి ముందు ఇచ్చిన హామీలు, చేసిన ప్రమాణాలన్నీ గాలికి వదిలేసి కేవలం బటన్ దబాయించే సీఎంగా పేరుతెచ్చుకున్నారు జగన్. రాష్ట్రంలో ఏ ప్రాంతా నికి వెళ్లినా నిరసనలే వెల్లువెత్తుతున్నాయి. గడప గడపకూ ప్రబుత్వం అంటూ తమ ప్రభత్వ పనితీరు, పథకాల గురించి ఉపన్యాసాలిచ్చి ప్పజలను తమ వేపు తిప్పుకునే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రు లకు మిగిలింది రోజూవారీ అవమానాలే. అదీ ఓట్లు వేసిన ప్రజల నుంచి.
మూడేళ్ల పాలనను అద్దంలో చూపినట్టు జగన్ కి ప్రజల ఛీత్కారమే చూపింది. కేంద్రంతో స్నేహబంధం ఉన్నప్పటికీ రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యిచూపడం గమనించారు. కేవలం ప్రయాణాలు తప్ప వాస్తవానికి కేంద్రం నుంచీ ఏమీ సాధించుకురాలేకపోయారు. ప్రజలు కోరుకునేది సుపరిపాలన తప్ప వేరేమీ ఉండదు. సుపరిపాలన మాటే లేకుండా కాలం గడిపేస్తోంది జగన్ సర్కార్. ఎవరికీ సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు. క్రమేపీ అన్ని లెక్కలూ తప్పా యి. వ్యూహాలన్నీ తిరగబడ్డాయి. వ్యూహ కర్తలు దూరమయ్యారు.. జగన్ నీ గెలుపు నీదే, నీ ఓటమీ నీదే అనేశారు. ప్రస్తుతం జగన్ తనను తాను గెలిపించుకోవడానికి, తన పార్టీని గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేసుకోవా ల్సిందే. కారణం ప్రజల మద్దతు కోల్పోయారు, పార్టీలో నాయకులు ప్రజాభిమానం కోల్పోయారు. సభల్లో మాట్లాడే తీరు పోయి తిట్ల పురాణమే ప్రసంగాలు గా కొత్త భాష్యంతో వెళుతూ అందర్నీ దూరం చేసుకున్నారు.
పరిస్థితులన్నీ ప్రజానాయకుడినే కోరుకుంటాయి. ప్రజానాయకుడు ఇప్పుడు రంగంలో మరింత ఉత్సాహంతో ముందడుగువేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, రాష్ట్ర అభిశృద్ధి మార్గాలు తెలిసిన నాయకునిగా చంద్రబాబు అధికారంలోకి రావడానికి మార్గాలు తెరుచుకున్నాయి. ప్రజలు తెలుగు దేశుప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారు. బాబుతోనే అన్నీ సాధ్యమన్న నిర్ణయానికి వచ్చే శారు. ఇక ఎన్నికలు రావడమే తరువాయి. జగన్ ను వీలువెంటనే కర్చీ దింపేద్దామని అన్ని ప్రాంతా ల్లోనూ ఓటరు కాచుక్కూర్చున్నాడు. బాదుడే బాదుడు పేరుతో ప్రభుత్వం మీద తెలుగు దేశం పార్టీ విరుచుకుపడుతోంది. దాంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. దీనితోనే తెలుగుదేశం నాయకులు, కార్య కర్తల మీద వీలున్నపుడల్లా దాడులకు కూడా పూనుకున్నారని విశ్లేషకుల మాట, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా రాజధాని అంశంలో జగన్ సర్కార్ మొండి పట్టు, రైతుల పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవడం వంటివన్నీ కలిసి జగన్ సర్కార్ వైఫల్యాన్ని, ప్రజల విముఖతను తెలియజేస్తున్నాయి.