గర్భధారణ పరీక్షలా హవ్వ..
posted on Apr 27, 2023 @ 5:58PM
మధ్య ప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలకు ఆకాశన్నంటుతున్నాయి. సభ్య సమాజం సిగ్గుపడేలా చర్యకు పాల్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మధ్య ప్రదేశ్ లోని దిండోరీ జిల్లాలో 100 మంది అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు చేసి ఫలితాలను బీజేపీ ప్రభుత్వం బహిర్గతం చేసింది.
మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన పథకం అమలు చేయడంలో భాగంగా అర్హులైన అమ్మాయిలను ఎంపిక చేయడానికి గర్భధారణ పరీక్షలు జరిపింది. గర్బిణీ అమ్మాయిలను ఈ స్కీం నుంచి ఏరి వేయడానికి బీజేపీ ప్రభుత్వం చట్టబద్దంగా అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు జరపడాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఖండించారు. ఇది మహిళలను అవమానపరిచే చర్య అని ఆయన అభివర్ణించారు. గర్భధారణ పరీక్షలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆయన జాతీయ మహిళా కమిషన్ చైర్మెన్ రేఖా శర్మను కోరారు. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు చక్కటి నిదర్శనం ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించడం మహిళల ప్రైవసీని నేరుగా దెబ్బతీయడమే అవుతుంది. గిరిజన అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు నిర్వహించడంతో ఆ రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిలకు కన్యత్వ పరీక్షలు చేయడం ఏ నాగరికత చెప్పలేదు. అయినా అక్కడి ప్రభుత్వం కన్యత్వ పరీక్షల మాదిరిగా చట్టబద్దంగా గర్భధాణ పరీక్షలు జరుపుతోంది.