అలస్కా ద్వీపకల్పంలో భూకంపం, సునామీ హెచ్చరికలు
posted on Jul 23, 2020 @ 9:58AM
అమెరికాలోని అలస్కా ద్వీపకల్పంలో తీవ్రవైన భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ భూకంపం సంభవించడం, సుమామీ వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మాస్కులు కట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.
అలస్కాలోని పెర్రివిల్లెకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. ఈ భూపంక తీవ్రత ఎక్కువ ఉండే దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పంతో పాటు అలూటియన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.