ఇండియన్ కార్డ్స్... చైనీస్ స్వైపింగ్!
posted on Dec 17, 2016 @ 4:08PM
డీమానిటైజేషన్... ఇప్పుడు ఇది పద్మవ్యూహంలా తయారైపోయింది. మోదీ నిర్ణయంతో రో్డ్డు మీదకొచ్చిన జనం క్యూ లైన్లలో సతమతం అవుతున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు నోట్ల రద్దును వెనక్కి తీసుకోవటం సాధ్యమా? అస్సలు కుదరదు! కాస్త భారంగానైనా క్యాష్ లెస్ ఎకానమీ వైపు అడుగులు వేయాలి. అందుకే, డీమానిటైజేష్ యావత్ దేశం చిక్కుకుపోయిన పద్మవ్యూహం అంటున్నారు కొందరు. ఏ మాత్రం తేడా వచ్చిన ఇందులోంచి బయటపడలేక ఆర్దికంగా చచ్చిపోవాల్సిందే. అందుకే, కేంద్ర ప్రభుత్వం చకచకా గండం గట్టెక్కే ఏర్పాట్లు చేస్తోంది...
డీమానిటైజేషన్ వల్ల నల్లదనం అరికట్టడం, ఉగ్రవాదానికి మూలలు లేకుండా చేయటం, ధరలు తగ్గించటం... ఇలాంటి బోలెడు లాభాలు వున్నాయి. కాని, అవన్నిటికి ముందు జనం చేతిలో డబ్బు లేకపోవటమనే టెన్షన్ వుంది. దాన్ని తగ్గించటానికే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు రంగంలోకి దింపుతున్నారు. ఈ పీఓఎస్ మిషన్లు అంటే మనం చూసే స్వైప్ మిషన్లే. కాకపోతే, వీట్ని భారీగా వాడాలని నిర్ణయించటంతో చైనా లాభపడుతోందట! ఎలాగో తెలుసా?
మన మార్కెట్లో లివింగ్ రూంలో వేసుకునే కుర్చీలు మొదలు వాష్ రూంలో వాడే మగ్గుల వరకూ అన్నీ చైనా వస్తువులే. కాని, ఎన్ని రకాల వస్తువులు దిగుమతైనా ఇంత కాలం స్వైపింగ్ మిషన్లు మాత్రం ఇండియాలోనే తయారు చేసేవారు. కాని, ఇప్పుడు గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఊరూరా, పట్టణాల్లో, నగరాల్లో వీట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటంతో మన దేశ కంపెనీల వల్ల సాధ్యం కావటం లేదట. భారీగా పీఓఎస్ మెషిన్లు తయారు చేయాలంటే అది డ్రాగన్ కంట్రీలోని రెండు ప్రధాన కంపెనీల వల్లే సాధ్యమట. అందుకే, వాటికి ఆల్రెడీ ఆర్డర్లు ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్.
చైనా పాకిస్తాన్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల్లో ప్రవర్తించటం మామూలే. కాని, అలాంటి దేశానికి మనకు అత్యవసరం వుండటంతో భారీ ఆర్డర్స్ ఇవ్వాల్సి రావటం పెద్ద విషాదం. మన శత్రువుకే మనం ఆర్దిక లాభం చేకూర్చిపెడుతున్నాం అన్నమాట! దీనిపై మోదీ సర్కార్ తక్షణం దృష్టి పెట్టి చైనా మాల్ ను అరికట్టాలి. అలాగే, స్వైపింగ్ మెషిన్ల లాంటి ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన పరికరాల్ని దిగుమతి చేసుకునేప్పుడు మరింత జాగ్రత్తగా కూడా వుండాలి. హ్యాకింగ్ లాంటి గోల్ మాల్ జరిగే అవకాశం కూడా వుంది. మరి మోదీ చైనీస్ మాల్ కి, గోల్ మాల్ కి విరుగుడు కనుక్కుంటారా లేదా వేచి చూడాలి...