కోటబొమ్మలి పీఎస్ లో పొటిటికల్ టచ్.. ఎవరూ భుజాలు తడుముకోవద్దు.. నిర్మాత బన్నీ వాసు
posted on Nov 7, 2023 @ 1:57PM
సినిమాలకూ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. గతంలో కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాల ప్రచారాల కోసం సినీ మాధ్యమాన్ని ఉపయోగించుకున్నారు. యు. విశ్వేశ్వరరావు, మాదాల రంగారావు, టి.కృష్ణ, దుక్కిపాటి మధుసూదనరావు వంటి వారు ఈ కోవలోకి వస్తారు. ఆ తరువాత రాజకీయ పార్టీల పక్షాన కొందరు సినిమాలు తీయడం మొదలైంది. ఆర్జీవీ వంటి వారు ఈ కోవకు వస్తారు. అయితే ఇవేమీ కాకుండా రాజకీయా అంశాలను స్పృశిస్తూ కమర్షియల్ గా ప్రయోజనం పొందే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇటీవల విడుదలైన బ్రో వంటి సినిమాలు ఆ కోవలోకి వస్తాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ అంశాలను కమర్షియల్ హిట్ కొట్టేందుకు సినిమాలలో ఉపయోగించుకోవడం సాధారణమే. ఇప్పుడు కూడా తెలుగురాష్ట్రాలలో ఎన్నికల హీట్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే తెలంగాణాలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మరో ఐదు నెలల్లో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సినిమాలలో కూడా ఆ హీట్ కు తగినట్లుగా పొలిటికల్ యాంగిల్ కలిపి వదులుతున్నారు. కొందరు చెప్పి చేస్తున్నారు. మరికొందరు సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో ఫలానా పొలిటికల్ డైలాగు ..ఫలానా పార్టీని ఉద్దేసించిందే అనే టాక్ మొదలవుతోంది. ఒక్కోసారి...ఈ టాక్ సినిమాకు ప్లస్ అవుతోంది అది వేరే సంగతి.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో పృధ్వీ ట్రాక్...డైరక్ట్ గా ఏపీ మినిస్టర్ అంబటి రాంబాబు ని ఉద్దేశించిందే నంటూ పెద్ద రచ్చ జరిగి.. ఓ రకంగా అది సినిమా కలెక్షన్స్ పెరిగేందుకు దోహదపడింది. అలాగే ఇప్పుడు అదే తరహాలో కోట బొమ్మాళి పిఎస్ సినిమా కు జరగబోతోందా అనిపిస్తోంది ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు మాటలు వింటూంటే.. గీతా ఆర్ట్స్ 2 సంస్థ అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ వస్తోంది తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయాట్టు అనే సినిమాని తెలుగులో కోట బొమ్మాళి పిఎస్ పేరుతో రీమేక్ తీసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాసు , విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లొ భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ.... ఈ సినిమా ఓవరాల్ గా ఉండే పొలిటికల్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పారు. ఇందులోని సన్నివేశాలు చూసి ఎవరైనా భుజాలు తడుముకుంటే తనకు సంభందం లేదనీ, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమకు చెందినవిగా ఉన్నాయని ఎవరైనా ఫీల్ అయితే వాళ్లు రియాక్ట్ అయితే అవ్వొచ్చని అన్నారు. మేము ఓ సింగిల్ పార్టీని టార్గెట్ చేయటం లేదు, ఇందులో కొన్ని సీన్స్.. కొంతమంది పొలిటీషన్స్ కు తగలచ్చు. అది చాలా పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్స్ ని ఇన్స్పైర్ అయ్యి రాసిన డైలాగుల కారణంగా అవ్వొచ్చు.. అలాగే కొంతమందికి అవి ఫట్ అని కొట్టినట్లుండొచ్చి అని బన్నీ వాసు అన్నారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున రంగంలోకి దిగుతారా అనే ప్రశ్నకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని సమాధానమిచ్చారు. మరి ఈ సినిమాలో రాసిన డై లాగ్స్ ఏ పార్టీని ..ఎవరిని ఉదేశించి రాసివుంటారన్న విషయంలో అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జరుగుతోంది.