ముట్టడి భయం తొలిగింది...కంచె తొలిగింది
posted on Oct 28, 2022 @ 3:55PM
పాలకుడు ప్రజామోదయోగ్యంగా వ్యవహరించాలి, పాలించాలి. ప్రజాసంక్షేమాన్ని ఎల్లపుడూ కోరుకోవాలి. అందుకు పాటుపడాలి. ప్రతీ పథకం, ప్రతీ పనీ ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయాలి. అప్పుడే ప్రజలు పాలకుడిని నెత్తిన పెట్టుకుంటారు, అభిమానిస్తారు. వీటన్నింటికీ విరుద్ధంగా పాలన సాగిస్తే ఇంటికీ పంపగలరు. ప్రజాగ్రహం అడ్డుకోవడం చాలా కష్టం. అందుకు తాజా ఉదాహరణే ఏపీ సీఎం జగన్ తన నివాసంవద్ద కంచెలు ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఆట్టే ప్రమాదం లేదు గనుక తీయిం చేస్తుండ డమూను.
ఇటీవల జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దుపై ఏపీ అంతటా నిరసనలతో ప్రభుత్వోద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వం పట్ల తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు. ఎప్ప టికప్పుడు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఆక్షేపిస్తున్నారని వ్యతిరేకంగా చలో విజయవాడ పిలుపు నిచ్చింది ఏపీసీపీ ఎస్‌ఈఏ. సమావేశమైన ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు చలో విజయవాడ సెప్టెం బర్ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ లోపు ఇచ్చిన హామీ ని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మిలినియం మార్చ్ పిలుపుతో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
ఎక్కడ ఉద్యోగులంతా ఇంటిమీదకి వచ్చి పడతారా అని భయంతో కంచె కట్టించారు. ప్రజలు, ముఖ్యం గా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వచ్చే వారిని దగ్గరికి రానీయకుండా కంచెలు, పోలీసులతో అడ్డు గోడ కట్టించేసుకుంటే పాలకుడని, మంచి సీఎం అని జగన్ ని ఎవరు మాత్రం అంగీకరిస్తారు. రాష్ట్ర మంతటా తీవ్ర నిరసనే వ్యక్తమవుతోంది. అయితే ఇక ఇప్పుడు ప్రజల నుంచీ అంతటా భయపడేంత దాడులకు, ముట్టడికి అవకాశం లేదుగనుక వెంటనే సీఎం ఇంటి కి వెళ్లే రహదారిలో కంచెను తొలిగించే పనులు పడ్డారు పోలీసులు. దారిన వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారని కంచెను తొలగిస్తున్నామని పోలీసులు అంటున్నారు.