ట్రాఫిక్ సమస్య...ప్రశ్నించిన మహిళపై కేసు
posted on Sep 19, 2022 @ 11:30AM
ప్రభుత్వాలు ప్రజాహితం కోసమే పనిచేయాలి. ప్రజల సమస్యలు, ఇబ్బందులు పట్టించుకోవాలి. కానీ చాలపర్యాయాలు చిన్నపాటి సమస్యల్ని కూడా నిర్లక్ష్యం చేయడం గమనార్హం. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షల విషయంలో ప్రజలు, వాహనదారులు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. సీఎం నివాసం నుంచి క్యాంప్ ఆఫీస్‌కి, లేదా ఫామ్‌హౌస్‌కి వెళ్లే సమయంలో గంటలతరబడీ ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ఇబ్బందికరంగా మారింది. ఉద్యోగులు చాలాపర్యాయాలు చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలు కావడమూ అయింది. దీనికి తోడు ఆ మధ్య అంటే ఈ నెల 17వ తేదీన పంజాగుట్ట పోలీసులు ఒక మహిళపై ఏకంగా కేసు నమోదు చేశారు. సీఎం వెళ్లే సమయంలో ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించిందిట.
ఈ నెల 17న సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ అనంతరం సాయంత్రం సమయంలో రాజ్ భవన్ రహదారిలో కాన్వాయ్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారి పైకి వచ్చే వాహనాలను నిలిపి వేశారు. రాజ్ భవన్ రోడ్ లక్కీ రెస్టారెంట్ వద్ద ట్రాఫిక్ కానిస్టే బుల్ బి.రాజు విధుల్లో ఉన్నారు. సీఎం కాన్వాయ్ వస్తోందని రెస్టారెంట్ మార్గంలో మెర్సిడస్ బెంజ్ కారు ను ఆపారు. ముందు సీట్లో కూర్చున్న మహిళ కిందికి దిగి ఎందుకు ఆపుతున్నారు, అత్యవసరంగా వెళ్లా లని అతడితో వాగ్వాదానికి దిగారు. ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వెళ్తుండగా వీవీఐపీ వస్తు న్నా రు.. వెళ్లొద్దని కాని స్టేబుల్ వారించారు.
అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పెట్రోలింగ్ పోలీసులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఆ మర్నాడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచనల మేరకు సదరు మహిళపై పంజా గుట్ట పీఎస్‌లో కానిస్టేబుల్ రాజు ఫిర్యాదు చేశాడు. తనను అసభ్య పదజాలంతో దూషించిందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఈ సంఘటన అంతా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశానని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరి సీఎం దాదాపు ప్రతీరోజూ రాకపోకల సమయంలో పోలీసులు విధిస్తున్న ట్రాఫిక్ ఆంక్షలతో పెద్ద సమస్యల్నే ఎదుర్కొంటున్న ఉద్యోగులు, పనులకు వెళ్లే కార్మికుల మాటేమిటి? దీన్ని గురించి ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న లు. దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం ఆశిస్తున్నారు.