భారత్, రాష్యా ఒప్పందం.. పాకిస్థాన్, చైనాలకు చెక్
posted on Oct 14, 2016 @ 11:13AM
ప్రధాని నరేంద్ర మోడీ రష్యాతో ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. రేపు ప్రారంభమయ్యే బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన క్షిపణుల ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు రష్యా ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా భారత్‌కు అత్యాధునిక ఐదు ఎస్-400 అనే ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగే క్షిపణులను అందించనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణిగా భావించే వీటికి.. దేశంపై దాడికి వచ్చే ఎయిర్‌క్రాఫ్ట్స్, మిస్సైల్స్‌ను 400 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టగలవు. అత్యాధునిక రాడార్ వ్యవస్థ కలిగిన ఈ క్షిపణులు నిఘా విమానాలను కూడా ఇవి గుర్తించగలవు. కాగా ఈ క్షిపణులు దేశంలోని కీలకమైన ప్రభుత్వ కేంద్రాలు, న్యూక్లియర్ పవర్‌ప్లాంట్స్ రక్షణ కోసం వినియోగించనున్నారు. మొత్తానికి భారత్ ఈ క్షిపణుల ద్వారా తన ప్రత్యర్థదేశాలైన పాకిస్థాన్, చైనాలకు చెక్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.