పాక్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
posted on Sep 29, 2016 @ 1:11PM
పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు పదేపదే చొరబాట్లకు పాల్పడుతున్నారని, ఇటీవలే సుమారు 20 చొరబాట్లను అడ్డుకున్నట్లు డైరక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రణ్‌వీర్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. చొరబాట్లు పెద్ద సమస్యగా మారయన్నారు. పీవోకే ప్రాంతంలో ఉన్న ఉగ్ర స్థావరాలను అడ్డుకోవాలని పాకిస్థాన్‌కు ఎన్ని సార్లు విన్నవించుకున్నా, ఆ దేశం పట్టించుకోవడం లేదని తెలిపారు. పీవోకే ప్రాంతంలో ఉన్న ఉగ్ర స్థావరాలను అడ్డుకోవాలని పాకిస్థాన్‌కు ఎన్ని సార్లు విన్నవించుకున్నా, ఆ దేశం పట్టించుకోవడం లేదని.. టెర్రర్ స్థావరాలపై జరిపిన సర్జికల్ దాడుల వల్ల ఉగ్రవాదులకు నష్టం జరిగిందన్నారు. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను అడ్డుకునేందుకే సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు ఆర్మీ డీజీఎంవో తెలిపారు. కాగా సర్జికల్ దాడులపై ఆర్మీ డీజీఎంవో ప్రకటన చేసిన కొన్ని క్షణాలకే సెన్సెక్స్ సుమారు 500 పాయింట్లు కోల్పోయింది.