మోడీ పుట్టినరోజు ఏర్పాట్లు.. గిన్నిస్ రికార్డ్ కోసం
posted on Sep 16, 2016 @ 10:48AM
ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని గుజరాత్ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఆయన పుట్టిన రోజు ఏర్పాట్లు ప్రారంభించేశారు. అయితే ఏర్పాట్లు అలా ఇలా కాదు.. ఏకంగా గిన్నిస్ రికార్డులు సాధించే విధంగా చేస్తున్నారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా.. గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో 11,223 మంది వికలాంగులకు 17వేల చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే వికలాంగులతో అతి పెద్ద లోగోను ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పనున్నారు. వినికిడి లోపం ఉన్న వేయిమందికి వినికిడి సాధనాలను పంపిణీ చేసి మరో రికార్డు నెలకొల్పాలని సర్కారు నిర్ణయించింది. అలాగే 15 వందల దీపాలను ఒకేచోట వెలిగించి మరో రికార్డును నెలకొల్పనుంది. మరి ఈ ఏర్పాట్లు ఎంత వరకూ రికార్డులు బద్దలు కొడతారో చూద్దాం..