అధ్యక్ష పదవికి, మంత్రి పదవికి శివపాల్ యాదవ్ రాజీనామా...
posted on Sep 16, 2016 @ 11:07AM
యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుండి అఖిలేశ్ యాదవ్ ను ములాయం సింగ్ యాదవ్ తప్పించిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ ను తప్పించి ఆ బాధ్యతలు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కు అప్పగించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. శివపాల్‌యాదవ్ యాదవ్ కూడా పదవి నుండి తప్పుకున్నారు. అంతేకాదు మంత్రి పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. కాగా గత కొద్ది రోజులుగా ములాయం కుటుంబంలో రాజకీయ విభేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ములాయం తన కొడుకు అయిన అఖిలేశ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించారు. అయితే అఖిలేశ్ కు మరో బాబాయి అయిన రాంగోపాల్ యాదవ్ మద్దుతు లభించింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు అఖిలేష్ కు చెప్పకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. మరి ఒకే కుటుంబంలో రెండు వర్గాలుగా ఏర్పడిన ఈ రాజకీయాలు.. వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతూయో చూడాలి.