మోడీ డిగ్రీపై ట్విస్ట్... పొరపాటున సంవత్సరం తప్పు పడింది..
posted on May 11, 2016 @ 12:51PM
ఇప్పటికే ప్రధాని మోడీ సంబంధించి డిగ్రీలపై ఆప్ నేతలు పలు ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు తాజాగా విపక్షాలకు మరో అస్త్రాన్ని అందిచ్చిట్టయింది. రెండు రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మోడీకి సంబంధిచిన మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్టిఫికేట్ నిజమే కాని సంవత్సరం మాత్రం పొరపాటున తప్పు పడిందని ఢిల్లీ రిజిస్ట్రార్ తరుణ్ దాస్ వెల్లిడించారు. తాము రికార్డులన్నీ పరిశీలించామని, ఆయన 1978లో పరీక్షలు పాస్ కాగా, 1979లో డిగ్రీ వచ్చినట్టు తప్పు పడిందని తెలిపారు. ఆయన సీసీ 594/74 నెంబరుతో ఎన్ రోల్ అయ్యారని, ఆయన హాల్ టికెట్ సంఖ్య 16594 అని దాస్ వివరించారు.
దీంతో ఇప్పుడు మోడీ డిగ్రీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు అన్నట్టు మోడీది నకిలీ సర్టిఫికేటేనా.. లేకపోతే.. 1978లో పాస్ అయితే.. 1979లో ఉత్తీర్ణుడైనట్టు సర్టిఫికెట్ ఇస్తే, అప్పుడే దాన్ని ఎందుకు సరిచేసుకోలేదన్నది.. ఇది కాకతాళీయంగా జరిగిందా? లేక ఆప్ ఆరోపిస్తున్నట్టు తప్పుడు ధ్రువపత్రమా? అని సందేహిస్తున్నారు. మరి దీనిపై మోడీ గారు చెబితే కాని అసలు విషయం ఏంటో తెలుస్తుంది.