బాత్ రూంలో జారిపడిన పెద్ది రెడ్డి చెయ్యి ఫ్రాక్చర్
posted on Mar 26, 2025 @ 3:35PM
వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. తన నివాసంలో బాత్ రూంలో జారి పడిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కుడి చేతి ఎముక విరిగినట్లు వైద్యులు చెప్పారు. పెద్దిరెడ్డికి శస్త్రచికిత్స చేశారు. చేతికి కట్టు వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.