టిడిపి ఎంపీగా పవన్ కళ్యాణ్..!!
posted on Dec 24, 2013 @ 11:00AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీచేస్తారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి కేవీపీ వియ్యంకుడు.. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం రాజుకు టికెట్ దాదాపుగా ఖరారై౦ది. అలాగే కాంగ్రెస్ నుంచి సిటింగ్ ఎంపీగా కనుమూరి బాపిరాజు రంగంలో ఉన్నారు. అయితే భారీ కేండిడేట్లు రంగంలో ఉన్న ఈ నియోజకవర్గ౦లో బరిలోకి పవన్ కూడా దీగడంతో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఎలక్షన్స్ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ...ఆయన వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ మధ్యన బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వహించినట్లు చెప్పుకున్నారు. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలపై పవన్ నుంచి ఖండన రాకపోవడం...తాజాగా టిడిపి తరపున లోక్‌సభకు పోటీ చేస్తారని వార్తలు రావడం..పవన్ మౌనం అంగీకారమేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.