అలా చేస్తేనే పాక్-భారత్ ల మధ్య చర్చలు..
posted on Jan 11, 2016 @ 10:31AM
పంజాబ్ లో పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసందే. ఈనేపథ్యంలో భారత్-పాక్ ల మధ్య ఈ నెల 15 న జరగనున్న ద్వైపాక్షిక చర్చలు రద్దయ్యాయి. పఠాన్ కోట్ పై దాడి చేసిన సూత్రధారులపై పాకిస్థాన్ చర్యలు తీసుకునే వరకు చర్చలు జరగవని కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందిన తర్వాత చర్చలపై పునరాలోచిస్తామని.. అప్పటి వరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సంబంధించిన సాక్ష్యాలను భారత్ తమకు అందించిందని పాక్ విదేశాంగశాఖ సైతం అంగీకరించింది. సాక్ష్యాల ప్రకారం దోషులపై చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.