రెండో రోజు ప్రారంభమైన పార్టనర్ షిప్ సదస్సు..
posted on Jan 11, 2016 @ 10:14AM
విశాఖలో రెండో రోజు పార్టనర్ షిప్ సదస్సు ప్రారంభమైంది. ఈ రెంజో రోజు సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, జయంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పలు ఐటీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా నిన్న ప్రారంభమైన ఈ సదస్సులో దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొదటి రోజే 32 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 49 ఐటీ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోనుంది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశం నలు మూలల నుంచి 1100 మంది ప్రతినిధులు, 41 దేశాల నుంచి 315 మంది విదేశీ ప్రతినిధులు, ఇతరులతో సహా అందరూ కలిపి 1450 మంది పాల్గొన్నారన్నారు. ఆదివారం జరిగిన 32 ఒప్పందాల ఆచరణలోకి వస్తే మొత్తం 94,748 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
అంతేకాదు ప్రపంచంలో భారత్ కు ఉన్న అనుకూలతలు మరే దేశానికి కూడా లేవని.. భవిష్యత్ లో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోందని.. మోడీ ప్రభుత్వంలో భారత్ దూసుకెళ్తుందని..భారతీయులు సాంకేతిక అంశాల్లో ముందంజలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.