పార్లమెంట్ సమావేశాలు మరోరోజు పొడిగింపు
posted on Sep 5, 2013 @ 9:08PM
శుక్రవారం ముగియాల్సిన పార్లమెంట్ సమవేశాలను ఒకరోజు పాటు అంటే శనివారం వరకు పొడిగించారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి సమైక్యాంద్ర తెలంగాణ ఆందోళనలతో పాటు బొగ్గు స్కాం విషయంలో బిజెపి పట్టు పట్టడంతో ఒక్క రోజు కూడా సభస జావుగా జరగలేదు. దీంతో ఈ సెషన్స్‌లో ఆమోదం పొందాల్సిన అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదానికి పార్లమెంట్ సమావేశాలను ఒక రోజు పొడిగించారు.
ఆగస్టు 5న ప్రారంభమైన ఈ వర్షాలకాల సమావేశాలు ఆగస్టు 30నే ముగియాల్సి ఉంది. ఆందోళనలతో సభ సజావుగా జరగకపోవటంతో ఈ నెల 6 వరకు సమావేశాలను పొడిగించారు. ఇప్పటికి పెన్షన్ ఫండ్, భూ ఆక్రమణల బిల్లులు ఆమోందిచకపోవడంతో ఇప్పుడు మరో రోజు సమావేశాలను పొడింగిచారు.