పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 14వ తేదీ నుంచి..
posted on Sep 1, 2020 @ 7:21PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 14న తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 9 గంటలకు దిగువ సభలో సమావేశం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపినట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ నోటికేషన్‌లో ప్రకటించారు. అదే రోజున రాజ్యసభ కూడా సమావేశం అవుతుంది. అయితే రెండు సభల ప్రారంభ సమయాల్లో వ్యవధి ఉంటుంది.
కోవిద్ 19 కారణంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ వెల్లడించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిద్ నిబంధనలు సభ్యులంతా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను దాదాపు 15రోజులు (అక్టోబర్ ఒకటో తేదీ వరకు) నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫారసు చేసింది. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సిన తయారీ, సరిహద్దుల్లో పరిస్థితులు, ఆర్థిక మాంద్యం ఎదుర్కోనే అంశాలు, రాష్ట్రాలకు నిధులు తదితర అంశాలపై చర్చ జరగనుంది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 20రోజుల పాటు
ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు దాదాపు 20రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున 20 రోజులపాటు సభ నిర్వహించే అవకాశాలున్నాయి.