Read more!

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్

 

 

 

 

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లకు కోర్టు అవకాశం కల్పించింది. అయితే కొత్త జనాభా ఎన్నికల ప్రకారం కాకుండా, రెండువేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరపవచ్చని కోర్టు తెలిపింది.


స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టిడిపి ఆహ్వానించింది. ఆపార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయ్యిందన్నారు. ఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.