అత్తా కోడళ్ళకు ఇంట్లోనే కాదు.. ఎన్నికల్లోనూ పోరే..
posted on Feb 8, 2021 @ 10:04AM
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కుటుంభ సభ్యుల మధ్యే ఎన్నికల పోరు సంబరాలు జరుగుతున్నాయి . కోడలు వైసిపి అంటే అత్తా టిడిపి అంటూ..సై అంటే సై అంటున్నారు ఒబిఆర్ కండ్రిగలో అత్తా కోడళ్ళు. తిరుపతి వడమాలపేట మండలంలోని ఓబీఆర్‌కండ్రిగలో పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా, సొంత ఇంట్లోనే కోడళ్ళు వైసిపి నుండి పొట్టి చేస్తుండగా, అత్తా టిడిపి నుండి బరిలో నిలిచారు. 1269 మంది ఓటర్లున్న పంచాయతీలో ఓబీఆర్‌కండ్రిగకు చెందిన శ్రీవిద్య గత పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుగా మళ్ళీ సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు.టీడీపీ నాయకులు ఓ అడుగు ముందుకేసి శ్రీదివ్య అత్త తులసమ్మను టిడిపి తరుపున సర్పంచ్ పదవికి రంగంలోకి దింపి అత్తా కోడళ్లకు రసవత్తర పోరుకు తెరలేపారు. ఈ పోటీ ఎన్నికల వర్గాలనే కాదు, స్థానిక ఓటర్లని కూడా హార్ట్ టాపిక్ గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఎన్నికల బరిలో నిలవడంతో ఓటర్ల అయోమయానికి గురి అవ్వడం తో పాటు, ఈ పోటీ ఎలా ఉండబోతుందో అని ఎదురు చూస్తున్నారనే చెప్పాలి.. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభావతి కూడా పోటీ పడుతున్నారు..
పంచాయతీలో క్షత్రియులు, యాదవులు, ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్నారు. దీంతో అత్తాకోడళ్లు అన్ని సామాజికవర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ మద్దతుదారు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆయకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఈ రసవత్తర ఎన్నికల పోరులో పెత్తనం ఎవరు చేస్తారో చూడాలి అత్తా కోడలు ఇద్దరిలో ఎవరికి పైచేయి అవుతుందో చూడాలి.