పాక్‌ది స్వయంకృతం..అర్ధంలేని షరీఫ్ ఆవేదన
posted on Sep 16, 2022 @ 12:28PM
చేసుకున్నదానికి చేసుకున్నంత అని సామెత. పెద్దలు అన్నది పాకిస్తాన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఆవి ర్భావం నుంచి పాకిస్తాన్ ఎవరితోనూ సఖ్యంగా లేదు. మిలటరీ చేతిలో కీలుబొమ్మగ ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయాలకు విలువలేనపుడు ప్రజలు సమస్యలు, భయాందోళన మధ్య కాలం గడపవలసిందే. ఇది దాదాపు పాక్ గురించి అన్ని దేశాలవారూ చాలాకాలం నుంచీ అభిప్రాయ ప డుతున్నదే. ఇది వినడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎంతో వాస్తవం. ఇవ్వాళ మేము అడుక్కుంటు న్నామని, చిన్నదేశాలే చాలా మెరుగ్గా ఉన్నాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేద న వ్యక్తం చేయడం పెద్దగా ఆశ్చర్యపరచదు.
ఇప్పటికీ విదేశాల మీద ఆధారపడవలసిన పరిస్థితుల్లోనే కాలం గడుపుతోంది. దీనికి తోడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నదీ వాస్తవమే. దాని ప్రభావమే ప్రపంచంలో శాంతిని కోరుకునే దేశాలన్నీ పాకి స్తాన్‌ను దూరం చేశాయి. క్రమేపీ పరిస్థితులు మరింత గడ్డుగా మారి 75 ఏళ్ల చరిత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే దేశాధినేతలకు సాధించిందేమీ కనపడలేదు. తాము 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని.. సంచా రం చేస్తూ.. అడు క్కుంటున్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెగ బాధపడుతున్నారు. తమ కంటే చిన్న దేశాలు కూడా ఆర్థిక రంగంలో మమ్మల్ని దాటిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మిత్ర దేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తు న్నాయని పాకిస్థాన్ ప్రధాన మంత్రి అన్నారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్‌లో జరిగిన న్యాయశాస్త్ర విద్యార్థుల స్నాతకోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను మిత్ర దేశాల్లో పర్యటించినప్పుడు డబ్బుల కోసమే వచ్చాననుకుంటున్నారని.. మిత్ర దేశాధినేత లకు ఫోన్ చేసినప్పుడు ఇదే పరిస్థితి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. వారంతా మేము భిక్షం అడుగు తామేమో అనే భావనలో ఉన్నారు. నిజంగానే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఇప్పుడు పాకి స్థాన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని వాపోయారు. మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా తమ పరిస్థితి తయా రైందన్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయానికే ఆర్థిక పరిస్థితి సంక్లి ష్టంగా మారిందన్నారు.
జూన్‌లో వచ్చిన వరదలు మూడో వంతు పాకిస్థాన్‌ను ముంచెత్తాయి. 1400 మంది చనిపోగా.. దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. రూ. 95 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. 78 వేల చదరపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి. ఓ వైపు కనీసం రూ.32 వేల కోట్లమేర అప్పు దొరుకుతుందేమోనని ఇంటర్నేషనల్ మోనిటర్ ఫండ్(ఐఎంఎఫ్) వద్ద ప్రయత్నాలు చేస్తుంటే.. అకాల వర్షాలు, వరదలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైపోయిందన్నారు షరీఫ్.
గత పాలకులు ఐఎంఎఫ్ నిబంధనలను ఉల్లంఘించిన పాపానికి.. ఇప్పుడు ఆ సంస్థ చేపట్టే కొన్ని కార్య క్రమాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. అతికష్టమ్మీద చేసిన ప్రయత్నాలతో ఐఎంఎఫ్ రూ. 14 వేల కోట్లను విడుదల చేసిందని, చైనా వంటి మిత్ర దేశాలు మరో రూ. 32 వేల కోట్ల మేర అప్పు ఇచ్చా యని పేర్కొన్నారు.