మాకు నచ్చిన చోట దాడి చేస్తాం.. భారత్ కు వార్నింగ్
posted on Sep 21, 2016 @ 11:39AM
భారత్ కు పాకిస్థాన్ ఎప్పుడూ పక్కలో బల్లెంలాగానే ఉంటుంది అన్న సత్యం అందరికి తెలిసిందే. మనం ఒకటి అంటే పాకిస్థాన్ మరొకటి అనడం అలవాటే. ఆ విషయం ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. తాజాగా పాకిస్థాన్ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. గత రెండు నెలలకు పైగా కాశ్మీర్లో అల్లర్లు చెలరెగుతున్న సంగతి తెలిసిందే. దీనికికాను.. ఆయన కశ్మీర్లో ఎవరు దాడి చేసిన తమనే(పాకిస్థాన్నే) బాధ్యులుగా చేయడం భారత్ కు అలవాటైపోయిందని యూరీ సెక్టార్లో దాడికి సంబంధించి తమపై భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు తీసుకున్నా 'ఇప్పుడు మీరు (భారత్) మీకు నచ్చిన చోటును ఎంపిక చేసుకొని దాడి చేస్తే మేం కూడా మాకు నచ్చిన చోట, నచ్చిన సమయంలో దాడి చేస్తాం' అంటూ హెచ్చరించారు. ప్రస్తుత దాడులకు సంబంధించి భారత్ మిలటరీ యాక్షన్ తో ప్రతీకారం తీల్చుకోవాల్సిందే అంటున్న డీజీఎంవో, డిఫెన్స్ మినిస్టర్ ఒక్కసారి జరుగుతున్న పరిణామాలు ఏమిటో అర్థం చేసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు.
యూరీ దాడికి పాల్పడిన ఆయుధాలు, పేలుడు సామాగ్రి మొత్తం పాక్ నుంచే వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి కదా అని మీడియా ప్రశ్నించగా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నుంచైనా ఎవరైనా ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని తాఫీగా సెలవిచ్చాడు. ఆయుధాలు అక్కడివే అయినా.. ఆ దాడికి పాల్పడినవారు పాక్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు లేవు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు.
కాగా, యూరి సెక్టర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. లాచిపుర ప్రాంతంలో దాడులకు దిగిన ఉగ్రవాదులను భారత సైన్యం ఏరిపారేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పదిమంది ఉగ్రవాదులు మరణించారు.