పాయ్‌గారూ, కర్ణాటక పరువు తీయొద్దు..బీజేపీ
posted on Sep 8, 2022 @ 3:51PM
దేశంలోనే అత్యంత ప్రశాంత నగరంగా, ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు భూతల నర కంగా మారిపోయింది. రహదారులు చెరువులయ్యాయి. భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. దారీ తెన్నూ కానరాక జనం నానా అవస్థలూ పడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నకర్నాటకలో అడ్మి నిస్ట్రేషన్ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి గత మూడు రోజులుగా బెంగళూరు వాసులు అనుభవి స్తున్న కష్టాలే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త టి. వి. మోహన్ దాస్ పాయ్ సేవ్ బెంగుళూర్ అంటూ భారీ ప్రచారానికి పూనుకున్నారు. పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని ఆయన నగరాన్ని గురించి ఆయన ప్రచారం చేశారు. దీంతో కర్ణాటక బీజేపీ ఆగ్రహించింది. పాయ్ చేస్తున్న ప్రచారంవల్ల కర్ణాటక ముఖ్యంగా బెంగుళూరు ప్రతిష్ట దెబ్బ తింటుందని బీజేపీ నేత ఎన్.ఆర్. రమేష్, పాయ్ పై మండిపడుతున్నారు.
వాస్తవాలు కేంద్రానికి తెలియజేయడంలో తప్పులేదని నెటిజన్లు కూడా భావిస్తున్నారు. కానీ వాస్తవ చిత్రం రాజకీయాల దృష్టితో చూస్తూ బీజేపీ నేతలు విమర్శలను భరించలేకపోతున్నారు. నగరంలో ఏ దారి చూసినా గోదారే అన్నట్లుగా తయారైంది. భారీ వర్షాలకు రహదారులు, హైవేలు మునిగాయి. ఉద్యోగులు బస్సుల్లోనూ, కార్లలోనూ కాకుం డా కార్యాలయాలకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్ప డింది. నగర పరిస్థితిపై వాణిజ్యవేత్త మోహన్ దాస్ సోషల్ మీడియాలోనూ, మీడియాలో ఉత్తరాల రూపం లోనూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవ స్థితి ప్రభుత్వానికి తెలియాలని, ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్న ఆశతోనే తాను అందుకు పూనుకున్నట్టుగా పాయ్ అన్నారు. కానీ ఇది బీజేపీ వారికి మింగుడుపడటం లేదు. ఇదిలా ఉండగా, గురువారం కూడా నగర దుస్థితిని వివరిస్తూ నెటిజన్లు వీడియో లను మంత్రులకు కూడా పోస్టు చేశారు.
బెంగుళూరునుంచి తెలంగాణాకు ఐటి సంస్థలు వెళిపోతున్నాయంటూ కూడా ప్రధానికి, ముఖ్యమంత్రికి లేఖలు రాయడం, వీడియోలు నగరం పరస్థితులను తెలియజేయడం కంటే ఆయనకు ప్రభుత్వం పట్ల విముఖతనే స్పష్టంచేస్తున్నాయన్నాయని బీబీఎంపి మాజీ సభ్యుడయిన రమేష్ అన్నారు. వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వం ప్రజల సంరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.