ఓవైసీ బ్రదర్స్‌కు కిరణ్ మరో ఝలక్!

 

 

 

 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు వదులుకున్నాక ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరులకు షాక్ మీద షాక్ తగులుతున్నాయి. మిథాని వద్ద ఉన్న రెండున్నర ఎకరాల భూమికి సంబందించి గతంలో ఒవైసీ సోదరులకు ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ను కిరణ్ సర్కార్ రద్దు చేసింది. నిజానికి ఆ రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఒవైసీ ఆస్పత్రికి ఇవ్వాలనుకుంది. అప్పట్లో రాజకీయంగా మద్దతు ఇస్తుండటమే ఇందుకు కారణం.


ఆ భూమిని ఇస్తానని నాటి ప్రభుత్వ పెద్ద హామీ ఇచ్చిన విషయాన్ని కూడా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి. ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకుంది. అనూహ్యంగా మిథానీ భూములపై స్టే ఉత్తర్వులను ఉపసంహరిస్తూ నాలుగు రోజుల కిందట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వును అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడ 'ఇది ప్రభుత్వ భూమి' అనే బోర్డు ఏర్పాటు చేశారు. రాజకీయం మారితే భూములు కూడా అలా మారిపోతాయి!.