దేశంలో ముందస్తు ఎన్నికలు
posted on Feb 10, 2013 @ 11:39AM
దేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉన్నాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపిఏ అసమర్థ విధానాల వల్ల ద్రవ్యలోటు శాతం పెరిగిందన్నారు. త్వరలో పార్లమెంటుకు ఎన్నికలు వస్తాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నా థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు.
ప్రజల ఒత్తిడితోనే పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన అప్జల్ గురును ఉరి తీశారన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించి, దేశద్రోహికి సరైన శిక్ష విధించారన్నారు. పార్లమెంటు సిబ్బందిని హతమార్చినప్పుడు నోరెత్తని, పెదవి విప్పని కొందరు తీవ్రవాదిని ఉరి తీస్తే ప్రజా సంఘాల పేరుతో నిరసనలు తెలుపడం విడ్డూరమన్నారు.