ప్రభుత్వ స్థలాలన్నీ మావే
posted on Apr 29, 2023 @ 6:04PM
ప్రభుత్వ స్థలాలు మేరా బాప్ కా జాగీర్ హై అన్నట్టు వ్యవహరిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. ప్రభుత్వ స్థలాన్ని ఒక సంస్థకు అమ్మాలన్నా, లీజుకు ఇవ్వాలన నియమ నిబంధనలు అడ్డొస్తాయి. కానీ జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న బీఆర్ఎస్ కు ప్రభుత్వ స్థలాలంటే తమ స్వంత స్థలాలుగా వ్యవహరిస్తుంది. ఈ స్థలాలను తమ ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో మరింత తీవ్రమయ్యాయి. హైదరాబాద్ కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అతిపెద్ద స్కామ్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డును ప్రయివేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం ఉండకపోవచ్చు. 30 వేల కోట్ల ఆదాయం తీసుకువస్తున్న ఔటర్ రింగ్ రోడ్డును కేవలం 7,380 కోట్ల రూపాయలకే ముంబాయికి చెందిన కంపెనీకి కట్ట బెట్టడం ఏమిటి?వేల కోట్ల చేతులు మారితేనే ఔటర్ రింగ్ రోడ్డు చేతులు మారిందని ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది.2018 నుంచి టోల్ బాధ్యతలు అప్పగించిందో తెలుసుకుంటే విషయం బోధపడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,696 కోట్లు పెట్టుబడులు పెట్టింది. కాంగ్రేస్ పార్టీ నుంచి అధికారం మారడంతో ఔటర్ రింగ్ రోడ్ ను అమ్మకానికి పెట్టేసే విధంగా వ్యవహరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా అమ్మకానికి పెట్టొచ్చు అని ప్రతి పక్షాలు అనుమానిస్తున్నాయి.