బైజూస్ దెబ్బకు కొండెక్కిన చదువులు
posted on Apr 29, 2023 @ 5:54PM
గత కొన్నేళ్లుగా భారతదేశంలో అవినీతి, అక్రమాల గురించి వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. రాజకీయ, ఆర్థిక రంగాలలో అవినీతి సర్వసాధారణమైపోయినా విద్యారంగంలో ఆ స్థాయి వార్తలు వెలువడ లేదు. కార్నొరేట్ కాలేజీలపై తరచూ అక్రమాలంటూ వార్తలు వింటున్నా.. ప్రస్తుతం బైజూస్ పై వచ్చిన ఆరోపణల ముందు అవన్నీ దిగదుడుపే.
మీరు చదివింది నిజమే భారత్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ పీకల్లోతు ఆక్రమాలలో మునిగి పోయింది. ఐదు కాదు పది కాదు ఏకంగా 28వేల కోట్ల అవినీతికి బైజూస్ పాల్పడిందని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. 28 వేల కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు రాబట్టి వాటిని లెక్కల్లో చూపలేదని సీబీఐ, ఈడీలు వాదిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూడు చోట్ల జరుగుతున్న సోదాతో అనేక కొత్త విషయాలు సీబీఐ, ఈడీల దృష్టికి వచ్చాయి. బైజూస్ వ్యవస్థాపకుడు రవిచందరన్ గణితం బోధించే ట్యూటర్ గా జీవితాన్ని ప్రారంభించాడు.
తన వద్ద శిష్యరికం చేసిన దివ్య గోకుల్ నాథ్ ను రవీంద్రన్ 2009లో వివాహమాడాడు. 2011 స్థాపించిన థింక్ అండ్ లెర్న్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 2015లో లాభాల బాట పట్టింది. 2015లో కంపెనీ బైజూస్ ది లెర్నిం్ ఆప్ ను ప్రారంభించి సంచలనాలకు తెరతీసింది. 2019 నుంచి కంపెనీ లెక్కలు సరిగా లేవని, తీసుకు వచ్చిన అప్పులు తిరిగి చెల్లించడం లేదనీ, లే ఆఫ్ లు ప్రకటిస్తున్నారని, వేల కోట్ల పెట్టుబడులపై ఫెరా నింబంధనలు అతిక్రమించారని బైజూస్ పై ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉంటే.. అక్రమాలకు నెలవైన బైజూస్ లో పిల్లలకు చదువులు చెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగ ముచ్చట పడుతోంది. వెనుకా ముందూ చేడకుండా వేల కోట్ల రూపాయలు ఖచ్చు పెట్టి పిల్లలకు ట్యాబ్ లు కూడా అందజేసింది. ట్యాబ్ లలో చదువు చెప్పేదుకు బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
అయినా వారి చదువులు పిల్లలకు అర్ధం కావడం లేదు. ప్రతి సంవత్సరం 8వ తరగతికి వచ్చేసుమారుఐదు లక్షల మందికి ట్యాబ్ లుఇచ్చి వారికి బైజూస్ సిలబస్ ను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. బైజూస్ ను నమ్ముకుని పిల్లలకు ట్యాబ్ లను అందించిన ప్రభుత్వం ప్రస్తుత బైజూస్ పరిస్థితి చూసి తలలు పట్టుకుంటోంది.